
ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ మోటోరోలా Moto G Stylus 5G (2023) ని యూఎస్ లో లాంచ్ చేసింది. ఈ డివైజ్ ప్రత్యేకత ఏంటంటే, ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ తో లాంచైంది. ఈ చిప్సెట్ తో లాంచైన మొట్టమొదటి హ్యాండ్సెట్ Moto G Stylus 5G (2023) కావడం విశేషం. ఇక చార్జింగ్ పోర్ట్ కి పక్కనే కనిపించే స్టైలస్ ని చూస్తే, అచ్చం శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా లో మాదిరే ఉంది.
సరే, ఓసారి Moto G Stylus 5G (2023) స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
Moto G Stylus 5G (2023) ధర, సేల్ తేదీ
ధర: Moto G Stylus 5G (2023) డివైజ్ ధర 399.99 డాలర్ల (సుమారు రూ.33,070) తో ప్రారంభమవుతుంది.
లభ్యత: Moto G Stylus 5G (2023) స్మార్ట్ ఫోన్ ని జూన్ 16 నుంచి అమెజాన్.కామ్, బెస్ట్ బై మరియు మోటోరోలా.కామ్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
Moto G Stylus 5G (2023) స్పెసిఫికేషన్స్
డిస్ప్లే
- ఫుల్ హెచ్డీ+
- ఎల్సీడీ
Moto G Stylus 5G (2023) స్మార్ట్ ఫోన్ లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజీ
- స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1
- ఎల్పీడీడీఆర్4ఎక్స్
Moto G Stylus 5G (2023) స్మార్ట్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వినియోగించారు. ఈ ఫోన్ 4జిబి/6జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. 2టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.
కెమెరా విభాగం
- 50ఎంపి రియర్ కెమెరా
- 16ఎంపి ఫ్రంట్ కెమెరా
Moto G Stylus 5G (2023) స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, మ్యాక్రో, డెప్త్ ఫంక్షన్స్ ఉన్న 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
ఓఎస్, కనెక్టివిటీ
- ఆండ్రాయిడ్ 13
- 3.5ఎంఎం జాక్
Moto G Stylus 5G (2023) స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మైయూఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్, స్టీరియో స్పీకర్, డాల్బి అట్మాస్ ఉన్నాయి.
డైమెన్షన్స్, వెయిట్
Moto G Stylus 5G (2023) స్మార్ట్ ఫోన్ 162.83 మిల్లీ మీటర్ల పొడవు, 73.77 మిల్లీ మీటర్ల వెడల్పు, 9.19 మిల్లీ మీటర్ల మందం, 202 గ్రాముల బరువు ఉంటుంది.











