Motorola: గీక్‌బెంచ్‌పై లిస్టైన Moto G24 Power

Highlights

  • కొన్ని నెలల్లో లాంచ్ కానున్న Moto G24 Power
  • హీలియో జీ85 చిప్సెట్ తో వస్తోన్న డివైజ్
  • కలర్ ఆప్షన్స్: డార్క్ బ్లూ, సిల్వర్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో Moto G24 Power అనే ఫోన్‌ని లాంచ్ చేయనుంది. అయితే దీని గురించి కంపెనీ నుంచి ఇంకా అధికార ప్రకటన ఏదీ రాలేదు. త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఈలోపు Moto G24 Power డివైజ్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై కనిపించింది. దీంతో ఫోన్ కి సంబంధించిన పలు స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Moto G24 Power గీక్‌బెంచ్ లిస్టింగ్

  • Moto G24 Power స్మార్ట్‌ఫోన్ బెంచ్ మార్కింగ్ సైట్ గీక్‌బెంచ్ పై సింగిల్-కోర్ టెస్ట్ లో 413 పాయింట్లు స్కోర్ చేసింది.
  • Moto G24 Power మల్టీ-కోర్ టెస్ట్ లో 1416 పాయింట్లు స్కోర్ చేసింది.
  • Moto G24 Power డివైజ్ గీక్‌బెంచ్ లిస్టింగ్ పై మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, మాలి-జీ52 ఎంసీ2 జీపీయూ తో లిస్ట్ అయ్యింది.
  • లిస్టింగ్ ప్రకారం, ఈ చిప్సెట్ మ్యాగ్జిమమ్ క్లాక్ స్పీడ్ 2 గిగాహెర్ట్జ్ గా ఉంది.
  • Moto G24 Power డివైజ్ 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది.

Moto G24 Power డిజైన్ (లీక్)

  • Moto G24 Power లో ఎమ్ లోగో, డ్యూయల్ కెమెరా లెన్సెస్, ఫ్లాష్‌లైట్ బ్యాక్ ప్యానెల్ పై ఉన్నాయి.
  • Moto G24 Power లో 50ఎంపి ప్రైమరీ కెమెరా గ్లాసీ ఫినిషింగ్ గల కెమెరా మాడ్యూల్ లో ఉంది.
  • Moto G24 Power డివైజ్ ఫ్లాట్ స్క్రీన్ కలిగి ఉంది. పవర్ బటన్ మరియు వాల్యూమ్ రాకర్ ఫోన్ కి కుడివైపున ఉన్నాయి. ఎడమవైపున కేవలం సిమ్ కార్డ్ ట్రే ఉంది.
  • Moto G24 Power లో ముందువైపు చూస్తే, పంచ్ హోల్ కటౌట్ ఉంది.
  • Moto G24 Power డివైజ్ కి టాప్ లో హెడ్‌ఫోన్ జాక్, బాటమ్ లో యూఎస్బీ-సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్, మైక్ ఉన్నాయి.

Moto G24 Power స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Moto G24 Power లో 6.5-ఇంచ్ ఎల్సీడీ హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Moto G24 Power లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ ఉంటుంది.
  • కెమెరా: Moto G24 Power లో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Moto G24 Power లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ అందించనున్నారు.
  • ఓఎస్: Moto G24 Power డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ కానుంది.
  • బ్యాటరీ: Moto G24 Power లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రానుంది.
  • కలర్స్: Moto G24 Power డివైజ్ డార్క్ బ్లూ మరియు సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Previous articleRedmi: 24GB LPDDR5T ర్యామ్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో రానున్న Redmi K70 Ultra
Next articleOPPO: లీకైన OPPO Reno 11F ఇమేజెస్, స్పెసిఫికేషన్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.