
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో OPPO Reno 11F అనే ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఇటీవలె రెనో సిరీస్ లో రెనో 11 మరియు రెనో 11 ప్రో ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. ఇప్పుడు OPPO Reno 11F డివైజ్ లాంచ్ కి సిద్ధమవుతోంది. భారత్ లో ఈ ఫోన్ OPPO F25 అనే పేరతో రీబ్రాండ్ అయ్యి లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. తాజాగా OPPO Reno 11F యొక్క ఇమేజెస్ మరియు స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
OPPO Reno 11F సర్టిఫికేషన్ వివరాలు
- OPPO Reno 11F స్మార్ట్‌ఫోన్ టీయూవీ రెయిన్‌ల్యాండ్ మరియు బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది.
- OPPO Reno 11F డివైజ్ CPH2603 అనే మోడల్ నంబర్ కలిగి ఉంది. అయితే సర్టిఫికేషన్స్ ద్వారా స్పెసిఫికేషన్స్ పెద్దగా రివీల్ కాలేదు.
- అయితే OPPO Reno 11F డివైజ్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
OPPO Reno 11F ఇమేజెస్, స్పెసిఫికేషన్స్ (లీక్)
- డిస్ప్లే: OPPO Reno 11F లో 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 10-బిట్ కలర్ సపోర్ట్ ఉంటాయి.
- ప్రాసెసర్: OPPO Reno 11F లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉంటుందని రివీల్ అయ్యింది.
- ర్యామ్, స్టోరేజీ: OPPO Reno 11F డివైజ్ 8జిబి ర్యామ్, 6జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది.
- కెమెరా: OPPO Reno 11F లో 64ఎంపి ఒమ్నివిజన్ ఒవి64బి ప్రైమరీ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి ఒమ్నివిజన్ ఒవి02బి10 మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: OPPO Reno 11F లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: OPPO Reno 11F డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: OPPO Reno 11F లో ఐపీ65 రేటింగ్, డ్యూయల్ సిమ్, 5జీ, బ్లూటూత్, వై-ఫై, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.











