Moto G34 5G: లీకైన మోటోరోలా జీ34 5జీ ఇండియా లాంచ్ ధర

Highlights

  • జనవరి 9న లాంచ్ కానున్న Moto G34 5G
  • 6.5-ఇంచ్ డిస్ప్లేతో వస్తోన్న డివైజ్
  • Moto G34 5G ధర రూ.10,999 ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో భారతీయ మార్కెట్ లో ఒక కొత్త జీ-సిరీస్ ఫోన్ లాంచ్ చేయనుంది. Moto G34 5G పేరుతో వస్తోన్న ఈ డివైజ్ జనవరి 9న లాంచ్ అవుతోంది. Moto G34 5G ఫోన్ 6.5-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 50ఎంపి డ్యూయల్ కెమెరా సెటప్ , 16ఎంపి ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లతో వస్తోంది. తాజాగా Moto G34 5G స్మార్ట్‌ఫోన్ యొక్క ఇండియన్ మార్కెట్ ధర లీక్ అయ్యింది. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Moto G34 5G భారత మార్కెట్ ధర (అంచనా)

  • రిటైల్ వర్గాల నుంచి Moto G34 5G ధర రివీల్ అయ్యింది. ఆ వివరాలు చూద్దాం.
  • Moto G34 5G 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,999 గా ఉంటుందని తెలుస్తోంది.
  • Moto G34 5G డివైజ్ యొక్క టాప్ వేరియంట్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర కాస్త ఎక్కువగా ఉంటుంది.
  • Moto G34 5G స్మార్ట్‌ఫోన్ ఐస్ బ్లూ, చార్కోల్ బ్లాక్ మరియు ఓషన్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Moto G34 5G స్పెసిఫికేషన్స్

ఫ్లిప్‌కార్ట్ లో కనిపిస్తోన్న డెడికేటెడ్ మైక్రోసైట్ మరియు మోటోరోలా ఇండియా వెబ్‌సైట్ ద్వారా Moto G34 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. అవెలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

  • డిస్ప్లే: Moto G34 5G లో 6.5-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 269 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Moto G34 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, అడ్రెనో జీపీయూ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Moto G34 5G రెండు స్టోరేజీ మోడల్స్ లో లభిస్తుంది. అవి: 4జిబి+128జిబి మరియు 8జిబి+128జిబి. ఈ ఫోన్ మైక్రోఎస్డీ కార్డ్ ఆప్షన్ తో వస్తోంది.
  • ఓఎస్: Moto G34 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ ఒక మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్ మరియు 3 ఏళ్ళ పాటు సెక్యూరిటీ ప్యాచెస్ పొందుతుంది.
  • కెమెరా: Moto G34 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ, చార్జింగ్: Moto G34 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లో ఫోన్ తో పాటు 20 వాట్ చార్జర్ ని కూడా అందించనున్నారు.
  • ఇతర ఫీచర్లు: Moto G34 5G లో ఐపీ52 రేటింగ్, వీగన్ లెదర్/3డీ పీఎంఎంఏ బ్యాక్ ప్యానెల్, 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
  • బరువు, చుట్టుకొలత: Moto G34 5G డివైజ్ 162.7 మి.మీ పొడవు, 74.6 మి.మీ వెడల్పు, 8.0 మి.మీ మందం, 180 గ్రాముల బరువు ఉంటుంది.
Previous articleSnapdragon 8+ Gen 1 చిప్సెట్‌తో చైనా లాంచైన Honor X50 GT
Next articleRealme 12 Pro: రివీలైన రియల్మీ 12 ప్రో రెండర్స్, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం!
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.