Realme 12 Pro: రివీలైన రియల్మీ 12 ప్రో రెండర్స్, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం!

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Realme 12 Pro సిరీస్
  • లైనప్ లో వస్తోన్న Realme 12 Pro, 12 Pro Plus
  • AMOLED డిస్ప్లేతో వస్తోన్న Realme 12 Pro

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme 12 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Realme 12 Pro మరియు Realme 12 Pro Plus డివైజెస్ లాంచ్ కానున్నాయి. భారత్ లో ఈ డివైజెస్ ఎప్పుడు లాంచ్ అవుతాయో ఇంకా తెలియదు. త్వరలోనే కంపెనీ నుంచి లాంచ్ తేదీ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే, ఈ ఫోన్లు పలు సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ లో లిస్ట్ అయ్యాయి. తాజాగా Realme 12 Pro డివైజ్ యొక్క రెండర్స్ టిప్‌స్టర్ ద్వారా లీక్ అయ్యాయి. దీంతో డిజైన్, కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Realme 12 Pro డిజైన్, కలర్ ఆప్షన్స్ (రెండర్స్)

  • Realme 12 Pro డివైజ్ రెండర్స్‌ని టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ చైనీస్ మైక్రో బ్లాగింగ్ సైట్ వీబో ద్వారా రివీల్ చేశారు.
  • రెండర్స్ లో Realme 12 Pro డివైజ్ బ్లాక్, ఆరెంజ్ మరియు క్రీమ్ కలర్స్ లో కనిపిస్తోంది.
  • Realme 12 Pro బ్యాక్ ప్యానెల్ పై యెల్లో కలర్ స్ట్రిప్ సెంటర్ లో ఉంది. దాని పైన కెమెరా మాడ్యూల్ ఉంది. రెండు మోడల్స్ వీగన్ లెదర్ తో రానుండగా, మరొక మోడల్ గ్లాస్ బ్యాక్ తో వస్తోంది.
  • Realme 12 Pro బ్యాక్ ప్యానెల్ పై ఉన్న కెమెరా మాడ్యూల్ లో ట్రిపుల్ లేదా క్వాడ్ కెమెరా సెటప్ ఉందనిపిస్తోంది. దీనికి తోడు ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది.
  • Realme 12 Pro డివైజ్ లో ముందువైపు కర్వ్డ్ ఎడ్జ్ పంచ్ హోల్ డిస్ప్లే ఉంది. మొత్తం మీద ఈ ఫోన్ చాలా సన్నగా, చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

Realme 12 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Realme 12 Pro లో 6.7-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Realme 12 Pro లో ఆక్టాకోర్ చిప్సెట్ ఉంటుంది. అయితే ఈ ప్రాసెసర్ పేరుని ఇంకా రివీల్ చేయలేదు.
  • ర్యామ్, స్టోరేజీ: Realme 12 Pro డివైజ్ 6జిబి/8జిబి/12జిబి/16జిబి ర్యామ్, 128జిబి/256జిబి/512జిబి/1టిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • బ్యాటరీ: Realme 12 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4,880 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. కెపాసిటీ ఇంకా తెలియదు.
  • కెమెరా: Realme 12 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 32ఎంపి టెలీఫోటో లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • ఓఎస్: Realme 12 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Realme 12 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.
Previous articleMoto G34 5G: లీకైన మోటోరోలా జీ34 5జీ ఇండియా లాంచ్ ధర
Next articleOPPO Reno 11 Series: లీకైన రెనో 11, రెనో 11 ప్రో భారత మార్కెట్ ధరలు
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.