హైలైట్స్:
* నేటి నుంచి భారత్ లో Moto G42 సేల్ ప్రారంభం.
* ఫ్లిప్ కార్ట్ తో పాటు కంపెనీ అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
* భారత్ లో మోటో జీ42 ధర రూ.13,999.
భారత్ లో Moto G42 ధర, లాంచ్ ఆఫర్లు
4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ తో కూడిన సింగిల్ వేరియంట్ తో వస్తున్న మోటో జీ42 ఫోన్ ధర రూ.13,999. ఫ్లిప్ కార్ట్ తో పాటు మోటోరోలా కంపెనీ యొక్క అధికార వెబ్ సైట్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ అట్లాంటిక్ గ్రీన్, మెటాలిక్ రోజ్ అనే రెండు రంగుల్లో లభ్యమవుతుంది.
ఎస్బీఐ కార్డు తో మోటో జీ42 ని కొనుగోలు చేస్తే రూ.1,000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, జీ5 యాన్యువల్ మెంబర్షిప్ పై రూ.549 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే రూ.999 విలువ గల బైజుస్ మెంబర్షిప్, రూ.4,999 కి గూగుల్ నెస్ట్ హబ్, రూ.1,999 కి గూగుల్ నెస్ట్ మినీ లభిస్తాయి.
Moto G42 స్పెసిఫికేషన్స్
Moto G42 స్పెక్స్
- 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే
- ఆండ్రాయిడ్ 12-ఆధారిత మైయూఎక్స్
- క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680
- 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 20 వాట్ ఛార్జింగ్
- 16ఎంపి సెల్పీ షూటర్
- 59ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరాస్
- ఐపీ52 రేటింగ్
మోటో జీ42 సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16ఎంపి కెమెరా ఉంది. అలాగే వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలున్నాయి. వీటిలో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రా వైడ్/డెప్త్ హైబ్రిడ్ కెమెరా, 2ఎంపి మైక్రో కెమెరాలున్నాయి. అలాగే ఈ ఫోన్ ఐపీ52 వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కలిగి ఉంది.