హైలైట్స్
- ఇటీవలె చైనాలో లాంచైన Moto G53 5G స్మార్ట్ ఫోన్
- ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తోన్న Moto G53 5G గ్లోబల్ వేరియంట్
- త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Moto G53 5G స్మార్ట్ ఫోన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా ఇటీవలె చైనాలో Moto G53 5G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. Moto G53 5G చైనీస్ వేరియంట్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480+ ప్రాసెసర్ తో లాంచైంది. మోటో జీ53 5జీ ఇంకా గ్లోబల్ గా లాంచ్ అవ్వాల్సి ఉంది. గ్లోబల్ వేరియంట్ వేరే చిప్సెట్ తో లాంచ్ అవ్వనున్నట్లు ప్రముఖ టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ తెలిపాడు. అలాగే ట్వీట్ ద్వారా Moto G53 5G యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేశాడు.
యోగేశ్ చెబుతున్న దాని ప్రకారం, Moto G53 5G క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్ తో లాంచ్ కానుంది. Moto G53 5G యొక్క గ్లోబల్ వేరియంట్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో రానుంది. అదే చైనీస్ వేరియంట్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చింది. మరొక టిప్‌స్టర్ SnoopyTech Moto G53 5G యొక్క గ్లోబల్ వేరియంట్ డిజైన్ రెండర్ ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. ఓసారి Moto G53 5G గ్లోబల్ వేరియంట్ యొక్క డిజైన్, స్పెసిఫికేషన్స్ ని తెలుసుకుందాం పదండి.
Moto G53 5G డిజైన్ రెండర్, స్పెసిఫికేషన్స్
Moto G53 5G గ్లోబల్ వేరియంట్ రెండర్స్ రివీల్ కావడంతో ఫోన్ ఎలా ఉండనుందో తెలిసింది. సెంటర్ పంచ్ హోల్ డిజైన్, మందపాటి చిన్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్, ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో ఫోన్ వస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక స్పెసిఫికేషన్స్ చూస్తే, Moto G53 5G గ్లోబల్ వేరియంట్ 6.6-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానుంది. చైనీస్ వేరియంట్ అయితే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఐపీఎస్ ఎల్సీడీ తో వచ్చింది.
Moto G53 5G స్మార్ట్ ఫోన్ గ్లోబల్ వేరియంట్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్ తో రానున్నట్లు సమాచారం. 4 జెన్ 1 చిప్ 6ఎన్ఎమ్ ప్రాసెస్ పై తయారైన ప్రాసెసర్. 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో ఈ ఫోన్ వస్తోంది. Moto G53 5G గ్లోబల్ వేరియంట్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ని కలిగి ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి డెప్త్ లేదా మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











