డిసెంబర్ 27 న సేల్‌కి రానున్న Lava X3 స్మార్ట్‌ఫోన్

హైలైట్స్

  • గతవారం భారత్ లో లాంచైన Lava X3 స్మార్ట్ ఫోన్
  • Lava X2 కి సక్సెసర్ గా వచ్చిన Lava X3
  • ప్రస్తుతం అమెజాన్ లో ప్రీ-ఆర్డర్ కి అందుబాటులో ఉన్న Lava X3
  • మీడియాటెక్ హీలియో ఏ22 చిప్, 4000ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన Lava X3

భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava గతవారం భారత్ లో Lava X3 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. కొన్ని నెలల క్రితం లాంచైన Lava X2 కి సక్సెసర్ గా Lava X3 మార్కెట్ లోకి వచ్చింది. Lava X3 ఒక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్. ఇది మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్ తో వచ్చింది. ప్రస్తుతం అమెజాన్ ద్వారా ఈ ఫోన్ ని ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు.

డిసెంబర్ 27 న Lava X3 సేల్ కి వస్తున్నట్లు సమాచారం. అమెజాన్ లిస్టింగ్ ద్వారా ఈ విషయం తెలిసింది. Lava X3 ఫోన్ 3జిబి ర్యామ్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి సెల్పీ కెమెరా తో వచ్చింది. భారత్ లో Lava X3 ఫోన్ లభ్యత, స్పెసిఫికేషన్స్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. పదండి.

భారత్ లో Lava X3 ధర, లభ్యత

Lava X3 3జిబి ర్యామ్ + 32జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.6,999 గా ఉంది. డిసెంబర్ 27 నుంచి అమెజాన్ ద్వారా ఈ ఫోన్ సేల్స్ మొదలు కానున్నాయి. ప్రస్తుతం Lava X3 ప్రీ-ఆర్డర్ కి అందుబాటులో ఉంది. ఎవరైతే ప్రీ-ఆర్డర్ చేస్తారో వారికి రూ.2,299 విలువగల Lava Probuds N11 నెక్ బ్యాండ్ ఉచితంగా లభిస్తాయి.

Lava X3 స్పెసిఫికేషన్స్

Lava X3 స్మార్ట్ ఫోన్ పాలికార్బొనేట్ బాడీతో తయారైంది. ఈ ఫోన్ 6.53-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, హెచ్డీ+ రెజుల్యూషన్ కలిగి ఉంది. వాటర్ డ్రాప్ నాచ్ లో ఫ్రంట్ కెమెరా ఉంటుంది. బెజెల్స్ సన్నగా, చిన్ మందంగా ఉంటుంది. ఎంట్రీ లెవెల్ ఫోన్ గనుక ఇది 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. మీడియాటెక్ హీలియో ఏ22 చిప్సెట్ ని ఈ ఫోన్ లో వాడారు.

Lava X3 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 8 ఎంపి ప్రైమరీ కెమెరా, మరొక వీజీఏ సెన్సర్ ఉంటాయి. ఒక ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంటుంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Lava X3 స్మార్ట్ ఫోన్ లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఇచ్చారు. 3జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ ఈ ఫోన్ లో ఉంటాయి. మెమొరీని మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 512జిబి వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ పై ఫోన్ పని చేస్తుంది. భద్రత కోసం రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, 3.5ఎంఎం జాక్ వంటి బేసిక్ కనెక్టివిటీ ఫీచర్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleTecno Pova 3 స్మార్ట్‌ఫోన్ పై రూ.2,000 డిస్కౌంట్
Next articleSnapdragon 4 Gen 1 చిప్సెట్ తో వస్తున్న Moto G53 5G గ్లోబల్ వేరియంట్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.