Home News [Exclusive] Moto G55: లీకైన మోటో జీ55 డిజైన్, రెండర్స్, స్పెసిఫికేషన్స్

[Exclusive] Moto G55: లీకైన మోటో జీ55 డిజైన్, రెండర్స్, స్పెసిఫికేషన్స్

Highlights
  • త్వరలో Moto G55 లాంచ్
  • తాజాగా లీకైన రెండర్స్, స్పెక్స్
  • 50ఎంపి కెమెరా, 256జిబి స్టోరేజీ

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో జీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Moto G55 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా 91mobiles కి ఈ ఫోన్ కి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ సమాచారం లభించింది. దీంతో జీ55 యొక్క డిజైన్, రెండర్స్ మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలిసింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Moto G55 రెండర్స్: డిజైన్, కలర్స్

Moto G55 యొక్క రెండర్స్‌ను టిప్‌స్టర్ సుదాన్శు షేర్ చేశారు. రెండర్స్‌ని గమనిస్తే, గ్రీన్, గ్రే మరియు పర్పుల్ కలర్స్ లో ఈ ఫోన్ రానున్నట్లు అర్థమవుతోంది.

డిజైన్ పరంగా, Moto G55 చూడటానికి, ఇటీవలె లాంచైన Moto G45 మాదిరి ఉంది. ఇంకా గతేడాది లాంచైన Moto G54 కంటే భిన్నంగా ఉంది. రియర్ కెమెరా మాడ్యూల్ బ్యాక్ ప్యానెల్ తో కలిసి కాస్త పైకి ఉబికి ఉంది.

కెమెరా మాడ్యూల్ లో రెండు సెన్సర్స్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఫ్లాష్‌లైట్ ఉంది. ఇంకా మోటోరోలా లోగో బ్యాక్ ప్యానెల్ మధ్యలో ఉంది.

ఇంకా Moto G55 లో కాస్త మందపాటి బెజెల్స్, చిన్ ఉన్నాయి. ఇంకా ఈ ఫోన్ లో 3.5ఎంఎం ఆడియో జాక్, టైప్-సీ పోర్ట్, పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.

Moto G55 స్పెసిఫికేషన్స్

కెమెరా: Moto G55 లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్/మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

ప్రాసెసర్: Moto G55 లో మీడియాటెక్ డైమెన్సిటీ 5జీ చిప్సెట్ ఉంటుంది. త్వరలోనే పేరు తెలుస్తుంది.

మెమొరీ: Moto G55 8జిబి వరకు ర్యామ్, ర్యామ్ బూస్ట్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉంటాయి.

బ్యాటరీ: Moto G55 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 30 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

ఇతర ఫీచర్లు: Moto G55 డివైజ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఐపీ54 ప్రొటెక్షన్ తో వస్తోంది.

Moto G54 స్మార్ట్‌ఫోన్, ఫుల్‌హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎల్సీడీ ప్యానెల్, డాల్బీ అట్మాస్ తో వచ్చింది. మరి Moto G55 ఏయే మార్పులతో వస్తుందో చూడాలి. ఇప్పటికి తెలిసిన సమాచారం ఇంతే, త్వరలోనే మరింత సమాచారంతో మీ ముందుకు వస్తాం.