ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola ఇటీవలె Edge 50 Pro అనే డివైజ్‌ని లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ కంపెనీ తన ఫోకస్‌ని జీ-సిరీస్ పై పెట్టింది. Moto G64 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని త్వరలోనే లాంచ్ చేసేందుకు సదరు కంపెనీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. భారత్ లో Moto G64 5G డివైజ్ ఏప్రిల్ 16న లాంచ్ చేయనుందని సమాచారం. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ పై మోటో జీ64 5జీ యొక్క టీజర్ దర్శనమిస్తోంది. దీంతో లాంచ్ తేదీ మరియు స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.
Moto G64 5G ఇండియా లాంచ్ తేదీ
ఫ్లిప్‌కార్ట్ పై కనిపిస్తోన్న టీజర్ ప్రకారం, Moto G64 5G డివైజ్ భారతీయ మార్కెట్ లో ఏప్రిల్ 16వ తేదీన లాంచ్ అవుతుంది.
Moto G64 5G లాంచ్ ఈవెంట్ మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. డివైజ్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అవుతుంది. అవి: 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ.
Moto G64 5G ఫోన్ మూడు ప్రీమియమ్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అవుతుందని మోటోరోలా కన్ఫర్మ్ చేసింది.
Moto G64 5G స్పెసిఫికేషన్స్
స్క్రీన్: Moto G64 5G లో 6.5-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ డిస్ప్లే, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ ఉంటాయి.
ప్రాసెసర్: Moto G64 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7025 చిప్సెట్ ఉంటుంది. ఈ చిప్సెట్ ఉత్తమమైన గేమింగ్ అనుభూతిని అందిస్తుంది.
ర్యామ్, స్టోరేజీ: మోటో జీ64 5జీ డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ర్యామ్ బూస్ట్ ఫీచర్ ద్వారా 24జిబి వరకు ర్యామ్ పవర్ యూజర్ కి లభిస్తుంది.
కెమెరా: మోటో జీ64 5జీ లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి మ్యాక్రో + డెప్త్ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
బ్యాటరీ: మోటో జీ64 5జీ ఫోన్లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ టర్బో పవర్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.
ఓఎస్: Moto G64 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవుతుంది. 3 ఏళ్ళ పాటు ఈ ఫోన్ కి సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.
ఇతర ఫీచర్లు: Moto G64 5G డివైజ్ 14 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ ఫోన్ లో డాల్బీ అట్మాస్, ఐపీ52 రేటింగ్, వై-ఫై, బ్లూటూత్ ఉంటాయి.
