
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు భారతీయ మార్కెట్ లో Edge 50 Pro 5G డివైజ్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఎన్నో ఆకట్టుకునే ఫీచర్లతో మార్కెట్ లోకి వచ్చింది. Motorola Edge 50 Pro 5G లో 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, ఐపీ68 రేటింగ్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి Motorola Edge 50 Pro 5G యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు లాంచ్ తేదీ వివరాలు తెలుసుకుందాం పదండి.
Motorola Edge 50 Pro 5G ధర, లభ్యత
Motorola Edge 50 Pro 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.31,999 గా నిర్ణయించారు. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.35,999 గా పెట్టారు.
లాంచ్ ఆఫర్ లో భాగంగా, ఫోన్ కొనుగోలుపై రూ.2,250 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే రూ.2,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ కూడా లభిస్తుంది.
ఆఫర్స్ అనంతరం, బేస్ మోడల్ ధర రూ.29,999 కి చేరుతుంది. టాప్ మోడల్ రూ.33,999 కి లభిస్తుంది.
Motorola Edge 50 Pro 5G డివైజ్ ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా వెబ్‌సైట్ మరియు రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా ఏప్రిల్ 9వ తేదీ నుంచి సేల్‌కి వస్తుంది.
Motorola Edge 50 Pro 5G స్పెసిఫికేషన్స్
స్క్రీన్: Motorola Edge 50 Pro 5G లో 6.7-ఇంచ్ 1.5కే 3డీ కర్వ్డ్ డిస్ప్లే, పీఓఎల్ఈడీ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 100% డీసీఐ-పీ3 కలర్ గేముత్, ఎస్జీఎస్ ఐ-ప్రొటెక్షన్ టెక్నాలజీ ఉన్నాయి.
ప్రాసెసర్: Motorola Edge 50 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. మ్యాగ్జిమమ్ క్లాక్ స్పీడ్ 2.63Ghz.
కెమెరా: Motorola Edge 50 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ + మ్యాక్రో లెన్స్, 10ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ, చార్జింగ్: Motorola Edge 50 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. 8జిబి ర్యామ్ వేరియంట్ 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. 12జిబి ర్యామ్ వేరియంట్ లో 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.
ఓఎస్: Motorola Edge 50 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హలో యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్‌కి 3 ఏళ్ళ పాటు ఓఎస్ అప్‌గ్రేడ్స్, సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.












