Moto G75 5G: 50MP OIS కెమెరా, 5000mAh బ్యాటరీతో గ్లోబల్‌గా లాంచైన మోటోరోలా కొత్త ఫోన్

Highlights

  • వెస్టర్న్ యూరప్‌లో Moto G75 5G విడుదల
  • త్వరలో భారత్ సహా ఇతర మార్కెట్స్ లో లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌తో వచ్చిన ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola జీ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Moto G75 5G పేరుతో ఈ ఫోన్ పశ్చిమ ఐరోపాలో లాంచ్ అయ్యింది. త్వరలో భారత్ సహా ఇతర మార్కెట్స్ లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్సెట్ తో వచ్చిన ప్రపంచపు తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. ఇంకా ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 16జిబి వరకు ర్యామ్, 256జిబి స్టోరేజీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Moto G75 5G ధర, కలర్స్

Moto G75 5G స్మార్ట్‌ఫోన్ ధరను 369 యూరోలు (సుమారు రూ.27,000) గా నిర్ణయించారు. నవంబర్ 5వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్‌కి వస్తోంది. చార్కోల్ గ్రే (మ్యాట్), ఆక్వా బ్లూ మరియు సకులెంట్ గ్రీన్ (వీగన్ లెదర్) కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

Moto G75 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Moto G75 5G లో 6.78-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, గొరిల్లా గ్లాస్ 5, ఫుల్‌హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Moto G75 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.

సాఫ్ట్‌వేర్: Moto G75 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మైయూఎక్స్ కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది. 5 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్, 6 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

ర్యామ్, స్టోరేజీ: Moto G75 5G డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీతో వచ్చింది. 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది. దీంతో యూజర్‌కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Moto G75 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Moto G75 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Moto G75 5G లో ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, MIL-STD-810H రేటింగ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, డాల్బీ అట్మాస్ డ్యూయల్ స్పీకర్స్, వై-ఫై, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: Moto G75 5G డివైజ్ 166.09 మి.మీ పొడవు, 77.24 మి.మీ వెడల్పు, 8.44 మి.మీ మందం, 208 గ్రాముల బరువు ఉంటుంది. మ్యాట్ ఫినిష్ వేరియంట్ 166.09 మి.మీ పొడవు, 77.24 మి.మీ వెడల్పు, 8.34 మి.మీ మందం, 205 గ్రాముల బరువు ఉంటుంది.