Realme C65s: 8GB ర్యామ్, 50MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన రియల్మీ కొత్త ఫోన్

Highlights

  • వియత్నాంలో Realme C65s విడుదల
  • 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తాజాగా గ్లోబల్ మార్కెట్ లో సీ-సిరీస్ లో కొత్త ఫోన్‌ని లాంచ్ చేసింది. Realme C65s పేరుతో ఈ డివైజ్ వియత్నాం దేశంలో విడుదలైంది. ఈ ఫోన్ లో 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.74-ఇంచ్ భారీ డిస్ప్లే, 16జిబి వరకు ర్యామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి రియల్మీ సీ65ఎస్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Realme C65s ధర

Realme C65s స్మార్ట్‌ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను VND 42,90,000 (సుమారు రూ.14,500) గా పెట్టారు.

8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను VND 47,90,000 (సుమారు రూ.16,000) గా పెట్టారు. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర VND 52,90,000 (సుమారు రూ.18,000) గా ఉంది.

Realme C65s స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme C65s లో 6.74-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ ఐ ప్రొటెక్షన్ డిస్ప్లే, హెచ్డీ+ రెజుల్యూషన్, 560 నిట్స్ బ్రైట్నెస్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme C65s లో ఎంట్రీ లెవెల్ యూనిఎస్ఓసీ టీ612 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ అందించారు.

ర్యామ్, స్టోరేజీ: Realme C65s డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. 8జిబి ఎక్స్‌పాండబుల్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది. దీంతో యూజర్‌కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Realme C65s లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి.

బ్యాటరీ, చార్జింగ్: Realme C65s లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫ్లాష్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

సాఫ్ట్‌వేర్: Realme C65s డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Realme C65s లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్ 5.0, వై-ఫై 5, 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Realme C65s లో ఐపీ54 వాటర్ రెసిస్టన్స్ రేటింగ్, టీయూవీ రెయిన్‌ల్యాండ్ రేటింగ్, ఏఐ కాల్ నాయిస్ రిడక్షన్ ఉన్నాయి. ఇంకా 4 ఏళ్ళ వరకు స్మూథ్ పెర్ఫామెన్స్‌ను కంపెనీ హామీ ఇస్తోంది.

Previous articleMoto G75 5G: 50MP OIS కెమెరా, 5000mAh బ్యాటరీతో గ్లోబల్‌గా లాంచైన మోటోరోలా కొత్త ఫోన్
Next articleTecno Spark 30C 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.