Moto X30 Pro: ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీని కన్ఫర్మ్ చేసిన కంపెనీ

హైలైట్స్:

  • మోటోరోలా తన ఫ్లాగ్ షిప్ ఎక్స్30 ప్రో తో పాటు మోటో రేజర్ 2022 ఫోల్డబుల్ ఫోన్ ని చైనాలో ఆగస్టు 2 న లాంచ్ చేయనుంది.
  • స్నాప్ డ్రాన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ తో వస్తున్న ఎక్స్ 30 ప్రో
  • 125 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తున్న మోటో ఎక్స్30 ప్రో, కన్ఫర్మ్ చేసిన కంపెనీ

తన తదుపరి ఫ్లాగ్ షిప్ ఫోన్ మోటో ఎక్స్ 30 ప్రో ని లాంచ్ చేసేందుకు మోటోరోలా సిద్దమవుతోంది. 2022, ఆగస్టు 2 న ఈ ఫోన్ చైనాలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ తో పాటు మోటో రేజర్ 2022 అనే ఫోల్డబుల్ ఫోన్ ని కూడా మోటోరోలా లాంచ్ చేయనుంది. ఇక స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తున్న తొలి ఫోన్ ఇదే కావడం విశేషం. మోటో ఎక్స్ 30 ప్రో ఫోన్లో 200ఎంపి మెయిన్ కెమెరా ఉండనున్నట్లు సమాచారం. భారత్ లో ఈ ఫోన్ మోటో ఎడ్జ్30 అల్ట్రా గా, గ్లోబల్ గా ఫ్రాంటియర్ అనే పేరుతో రిలీజ్ అవ్వనుంది. తాజాగా మోటోరోలా కంపెనీ, మోటో ఎక్స్30 ప్రో 125 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది.

125W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ తో వస్తున్న Moto X30 Pro

లెనోవో చైనా, మొబైల్ ఫోన్ విభాగం జనరల్ మేనేజర్ చెన్ జిన్, మోటో ఎక్స్30 ప్రో 125 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ని కలిగి ఉండనున్నట్లు ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు ఉన్న మోటోరోలా స్మార్ట్ ఫోన్స్ లో మోటో ఎక్స్30 ప్రో ఫాస్టెస్ట్ ఛార్జింగ్ కలిగిన ఫోన్ గా నిలవనుంది. ఇక మోటో ఎక్స్30 ఫోన్ 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. దీంతో మోటోరోలా ఒక మంచి స్టెప్ తీసుకున్నట్లైంది. చైనాకు చెందిన మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ వీబో ద్వారా చెన్ జిన్ 125 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ని ప్రజెంట్ చేశారు. మోటో ఎక్స్30 ప్రో వైర్లెస్ ఛార్జింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుందని సమాచారం.

Moto X30 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

మోటోరోలా ఎక్స్30 ప్రో 6.73 అంగుళాల పీవోఎల్ఈడీ డిస్ప్లే, సెల్ఫీ కెమెరా కోసం సెంటర్ పంచ్ హోల్ కటౌట్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 12జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ వంటి ఫీచర్లు మోటో ఎక్స్30 ప్రో లో ఉండనున్నాయని అంచనా.

ఇక కెమెరా విభాగం పై ఓ కన్నేద్దాం పదండి. మోటో ఎక్స్30 ప్రో లో 200ఎంపి భారీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 12ఎంపి టెలీఫోటో కెమెరా, 60ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనున్నాయి. ప్రపంచపు తొలి 200ఎంపి కెమెరా ఫోన్ ఇదేనని కంపెనీ చెబుతోంది. ఇప్పుడు బ్యాటరీ విభాగం వివరాలను చూద్దాం. ఈ ఫోన్లో 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 125 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, యూఎస్బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్, ఆండ్రాయిడ్ 12 ఆధారిత మైయూఐ 4.0 కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లను ఎక్స్30 ప్రో కలిగి ఉంది.

60ఎంపి ఫ్రంట్ కెమెరాతో వస్తున్న మోటో ఎక్స్30 ప్రో వ్లాగింగ్ చేసే వారికి ఎంతో ఉపయోగపడనుంది. మరోవైపు 200ఎంపి రియర్ కెమెరా ఉండటం ఈ ఫోన్ కి బిగ్ ప్లస్. లేెటెస్ట్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 125వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఫోన్ లో బలమైన ఫీచర్లుగా కనిపిస్తున్నాయి. భారత్ లో లాంచ్ తర్వాత ఈ ఫోన్ కి మాంచి గిరాకీ ఏర్పడటం ఖాయమని తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఏం జరగనుందో చూద్దాం.

Previous articleభారత మార్కెట్ నుంచి తప్పుకున్న Honor
Next articleనేటి నుంచి OPPO Reno8 5G, OPPO Enco X2 సేల్ ప్రారంభం
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.