Motorola: AI ఫీచర్లతో లాంచ్ కానున్న Moto X50 Ultra; టీజర్ షేర్ చేసిన కంపెనీ

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Moto X50 Ultra
  • తాజాగా రివీలైన టీజర్
  • ఏఐ ఫీచర్లతో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో ఒక కొత్త ఎక్స్-సిరీస్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. Moto X50 Ultra పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా మోటోరోలా సంస్థ ఈ ఫోన్‌ని టీజ్ చేసింది. డివైజ్ ఏఐ ఫీచర్లతో వచ్చే అవకాశం ఉందని అందరూ అంచనా వేస్తున్నారు. త్వరలో లాంచ్ కాబోయే Moto X50 Ultra యొక్క టీజర్ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Moto X50 Ultra టీజర్ వీడియో

  • Moto X50 Ultra టీజర్ వీడియోను మోటోరోలా సంస్థ షేర్ చేసింది. ఫోన్ తో పాటు వీడియోలో ఫార్ములా 1 కార్ లెనోవో బ్రాండింగ్ తో కనిపిస్తోంది.
  • Moto X50 Ultra డివైజ్ లెదర్ ఫినిషింగ్ (వీగన్ లెదర్) తో వచ్చే అవకాశం ఉంది. పవర్ మరియు వాల్యూమ్ బటన్స్ కనిపిస్తున్నాయి. ఇక టాప్ లెఫ్ట్ కార్నర్ లో కెమెరా మాడ్యూల్ ఉంది.
  • Moto X50 Ultra స్మార్ట్‌ఫోన్ బ్లాక్ లేదా డార్క్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. టీజర్ ద్వారా Moto X50 Ultra డిజైన్ స్పష్టంగా తెలియలేదు.
  • ఏప్రిల్ 21న Moto X50 Ultra డివైజ్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. త్వరలోనే మోటోరోలా నుంచి లాంచ్ కి సంబంధించిన ప్రకటన రానుంది.

Moto X50 Ultra స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • ఓ కథనం ప్రకారం, Moto X50 Ultra డివైజ్ సరికొత్త రూపంతో రానున్నట్లు తెలుస్తోంది.
  • Moto X50 Ultra లో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 125 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది.
  • టీజర్ వీడియో ద్వారా Moto X50 Ultra కి సంబంధించిన ఇతర వివరాలు ఏమీ తెలియలేదు. అయితే జనరేటివ్ ఏఐ టెక్నాలజీ ఈ ఫోన్ లో ఉంటుందని టీజర్ ద్వారా తెలుస్తోంది.
  • ఇదివరకు ఈ టెక్నాలజీని శాంసంగ్, ఒప్పో మరియు వన్‌ప్లస్ బ్రాండ్స్ తీసుకొచ్చాయి.
  • Moto X50 Ultra స్మార్ట్‌ఫోన్ కేవలం చైనా మార్కెట్ కే పరిమితం అవుతుందా లేదా ఇతర మార్కెట్స్ కి కూడా వస్తుందా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
Previous articlePOCO: బీఐఎస్, బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్స్‌పై లిస్టైన POCO C61
Next articleNokia: భారత్‌లో లాంచైన Nokia G42 5G 4జిబి ర్యామ్ వేరియంట్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.