
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nokia నుంచి చవకైన స్మార్ట్‌ఫోన్ Nokia G42 5G 2023 సెప్టెంబర్ నెలలో లాంచ్ అయ్యింది. లాంచ్ సమయంలో, ఈ ఫోన్ 8జిబి ర్యామ్ మరియు 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు కంపెనీ Nokia G42 5G యొక్క 4జిబి వేరియంట్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ర్యామ్ తప్పితే మిగతా స్పెసిఫికేషన్స్ లో ఏ విధమైన మార్పు లేదు. సరే, ఓసారి Nokia G42 5G 4జిబి ర్యామ్ వేరియంట్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Nokia G42 5G ధర, సేల్ వివరాలు
- Nokia G42 5G 4జిబి ర్యామ్ మోడల్ 2జిబి వర్చువల్ ర్యామ్ మరియు 128జిబి స్టోరేజీతో వచ్చింది.
- Nokia G42 5G 4జిబి మోడల్ ధరను కంపెనీ రూ.9,999 గా నిర్ణయించింది.
- భారతీయ మార్కెట్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న చవకైన స్మార్ట్ఫోన్లలో Nokia G42 5G కూడా ఒకటి.
- Nokia G42 5G 4జిబి ర్యామ్ వేరియంట్ సో పర్పుల్ మరియు సో గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- మార్చి 8వ తేదీ నుంచి అమెజాన్ ద్వారా Nokia G42 5G 4జిబి ర్యామ్ మోడల్ సేల్ మొదలవుతుంది.

Nokia G42 5G స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Nokia G42 5G లో 6.56-ఇంచ్ హెచ్డీ+ వాటర్‌డ్రాప్ నాచ్ డిస్ప్లే, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Nokia G42 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ వాడారు.
- ఓఎస్: Nokia G42 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
- కెమెరా: Nokia G42 5G డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Nokia G42 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 20 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Nokia G42 5G లో డ్యూయల్ సిమ్, 4జీ, 5జీ, బ్లూటూత్, వై-ఫై, ఓజో ప్లేబ్యాక్ ఆడియో, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.











