లాంచ్ కి ముందు రివీల్ అయిన Motorola Devon 5G స్పెసిఫికేషన్స్, డిజైన్

హైలైట్స్:

  • మోటో జీ32 4జీ స్మార్ట్ ఫోన్ లాగా కనిపిస్తోన్న Motorola Devon 5G డిజైన్
  • 64ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా, మీడియాటెక్ చిప్సెట్ తో వస్తోన్న Motorola Devon 5G
  • Motorola Devon 5G ఫోన్ ని Moto G32 5G అని పిలిచే అవకాశం

Motorola Devon 5G స్పెసిఫికేషన్స్, రెండర్ ఇమేజ్ 91మొబైల్స్ ద్వారా రివీల్ అయ్యియి. ఇండస్ట్రీకి చెందిన ఒక వ్యక్తి ద్వారా ఈ సమాచారం అందింది. ఇది వరకు డెవన్ ఫోన్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఇదొక 4జీ లో-మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ అని, స్నాప్ డ్రాగన్ 680 చిప్ తో వస్తుందని అనుకున్నారు. గత నెలలో ఈ డివైజ్ Moto G32 అనే పేరుతో లాంచ్ అయ్యింది. డెవన్ యొక్క 5జీ వేరియంట్ కూడా త్వరలోనే లాంచ్ కానుంది. పైన చూపబడిన ఇమేజ్ మాదిరి ఆ ఫోన్ ఉంటుంది.

Motorola Devon 5G డిజైన్, స్పెసిఫికేషన్స్

పైన కనిపిస్తోన్న రెండర్ ఇమేజ్ ని బట్టి చూస్తే, Motorola Devon 5G ఫోన్ డిజైన్ Moto G32 4G ఫోన్ లాగా ఉన్నట్లు తెలుస్తోంది. సెంటర్ పంచ్ హోల్ కటౌట్, రెక్టాంగ్యులర్ రియర్ కెమెరా మాడ్యూల్ ని ఇమేజ్ లో మనం గమనించవ్చు. రియర్ కెమెరా మాడ్యూల్ లో మూడు సెన్సర్స్ ఉండనున్నాయి. ఇందులో 64 మెగా పిక్సెల్ ప్రైమరీ లెన్స్, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో లెన్స్, 2 మెగా పిక్సెల్ డెప్త్ కెమెరా ఉండనున్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 16 మెగా పిక్సెల్ కెమెరా ఉండనుంది.

Motorola Devon 5G స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ 5జీ చిప్సెట్ తో రానుంది. అయితే ఆ ప్రాసెసర్ పేరేంటో ఇంకా తెలియదు. త్వరలోనే ఈ విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది. 4జిబి ర్యామ్ మరియు 6జిబి ర్యామ్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది. మోటోరోలా జీ32 4జీ డైమెన్షన్స్ లాగే ఈ ఫోన్ అమరిక ఉంటే కనుక, 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉండనుంది. ఇప్పటికి Motorola Devon 5G గురించి మాకు తెలిసిన సమాచారం ఇంతే. త్వరలోనే ఈ కొత్త స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

ఇప్పటికే 4జీ వర్షన్ విడుదల అయ్యింది కనుక, ఏ క్షణమైనా మోటోరోలా కంపెనీ Motorola Devon 5G స్మార్ట్ ఫోన్ ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది ముగిసే లోపు Motorola Devon 5G కి సంబంధించిన లాంచ్ ప్రకటన వస్తుందని అంచనా వేయవచ్చు. అప్పుడే పేరు యొక్క అసలైన మార్కెటింగ్ పేరు తెలుస్తుంది. మోటోరోలా ఈ ఫోన్ ని సింపుల్ గా Moto G32 5G అని పిలుస్తుందని మేం భావిస్తున్నాం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

Previous articleగ్లోబల్ గా లాంచ్ అయిన Xiaomi 12T, Xiaomi 12T Pro
Next article200MP కెమెరా, కర్వ్డ్ AMOLED డిస్ప్లే తో లాంచ్ అయిన Infinix Zero Ultra 5G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.