హైలైట్స్:
- గ్లోబల్ గా ఎంట్రీ ఇచ్చిన Xiaomi 12T, Xiaomi 12T Pro స్మార్ట్ ఫోన్స్
- Xiaomi 11T లైనప్ కి సక్సెసర్స్ గా వచ్చిన 12T సిరీస్
- 108ఎంపి, 200ఎంపి మెయిన్ కెమెరాలను కలిగి ఉన్న 12టీ, 12టీ ప్రో
Xiaomi 12T, Xiaomi 12T Pro స్మార్ట్ ఫోన్స్ గ్లోబల్ గా లాంచ్ అయ్యాయి. షావోమీ 11టీ లైనప్ కి ఇవి సక్సెసర్స్ గా రంగంలోకి దిగాయి. 200ఎంపి శాంసంగ్ సెన్సర్ తో వస్తున్న తొలి షావోమీ ఫోన్ 12టీ ప్రో కావడం విశేషం. ఇంతకు ముందు శాంసంగ్ 200ఎంపి సెన్సర్ తో Moto Edge 30 Pro మార్కెట్ లోకి వచ్చింది. Xiaomi 12T, Xiaomi 12T Pro ఫోన్లు 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో వస్తున్నాయి. 12టీ ప్రో లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ ఉపయోగించగా, 12టీ లో డైమెన్సిటీ 8100 చిప్సెట్ వాడారు.
Xiaomi 12T, Xiaomi 12T Pro ధరలు
Xiaomi 12T 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 599 యూరోలు (దాదాపు రూ.48,463). ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.
మరోవైపు, Xiaomi 12T Pro 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 749 యూరోలు (దాదాపు రూ.60,583). ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.
Xiaomi 12T, Xiaomi 12T Pro స్పెసిఫికేషన్స్
Xiaomi 12T లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 2712*1220 పిక్సెల్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, డాల్బీ విజన్, 480 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్, మాలి-జీ610 6-కోర్ జీపీయూ, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో వస్తోంది.
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై Xiaomi 12T పని చేస్తుంది. Xiaomi 12T లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్లో ఉన్నాయి. ఈ ఫోన్లో స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, ఐఆర్ బ్లాస్టర్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఉన్నాయి.
ఇప్పుడు Xiaomi 12T కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Xiaomi 12T లో 108ఎంపి ప్రైమరీ శాంసంగ్ ఐసోసెల్ హెచ్ఎం6 సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 20ఎంపి ఐఎంఎక్స్596 సెన్సర్ అమర్చారు.
Xiaomi 12T Pro లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 2712*1220 పిక్సెల్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, డాల్బి విజన్, 480 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.
Xiaomi 12T Pro లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, అడ్రెనో జీపీయూ గ్రాఫిక్స్, 8జిబి/12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 128జిబి/256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది. Xiaomi 12T Pro లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్స్, డాల్బి అట్మాస్, ఐఆర్ బ్లాస్టర్, ఐఆర్ బ్లాస్టర్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఈ ఫోన్లో ఉన్నాయి.
Xiaomi 12T Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200ఎంపి ప్రైమరీ సెన్సర్ (ఓఐఎస్), 8ఎంపి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం Xiaomi 12T Pro లో 20ఎంపి ఐఎంఎక్స్596 సెన్సర్ అమర్చారు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.














