
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Motorola 2023 ఆరంభంలో Motorola E13 అనే బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. అప్పుడు రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో భారత్ లో Motorola E13 ప్రవేశించింది. తాజాగా కంపెనీ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ని మార్కెట్ లోకి వదిలింది. Motorola E13 ధరను రూ.8,999 గా నిర్ణయించారు. సరే, Motorola E13 సేల్ వివరాలు, లభ్యత, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
Motorola E13 8జిబి ర్యామ్ వేరియంట్ ధర
Motorola E13 డివైజ్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.8,999 గా నిర్ణయించారు. అయితే ఈ ధర లాంచ్ ఆఫర్ లో భాగంగా పెట్టారు. తర్వాత పెరిగే అవకాశం ఉంది. ఆగస్టు 16 నుంచి Motorola E13 డివైజ్ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ కి రానుంది. 2023 ఫిబ్రవరిలో Motorola E13 డివైజ్ 2జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ, 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ ఆప్షన్స్ లతో లాంచ్ అయ్యింది.
Motorola E13 స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Motorola E13 స్మార్ట్ ఫోన్ లో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 20:9 యాస్పెక్ట్ రేషియో, 720*1600 పిక్సెల్ రెజుల్యూషన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- చిప్సెట్: Motorola E13 డివైజ్ లో యూనిఎస్ఓసీ టీ606 ప్రాసెసర్ వాడారు. ఇది 2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ గల ఆక్టా-కోర్ చిప్. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ వినియోగించారు.
- స్టోరేజీ: Motorola E13 డివైజ్ లో 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా స్టోరేజీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.
- కెమెరా: Motorola E13 స్మార్ట్ ఫోన్ లో 13ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Motorola E13 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Motorola E13 లో డ్యూయల్ సిమ్ 4జీ, వై-ఫై, బ్లూటూత్, ఐపీ52 రేటింగ్ ఉన్నాయి.
- బరువు, కొలతలు: Motorola E13 డివైజ్ 164.19 మి.మీ పొడవు, 74.95 మి.మీ వెడల్పు, 8.47 మి.మీ మందం, 179.5 గ్రాముల బరువు ఉంది.











