Realme GT 5: ఖరారైన రియల్మీ జీటీ 5 చిప్సెట్; పూర్తి వివరాలు తెలుసుకోండి!

Highlights

  • కన్ఫర్మ్ అయిన తదుపరి రియల్మీ ఫ్లాగ్షిప్ డివైజ్ Realme GT 5
  • చిప్సెట్ గురించి మాట్లాడిన రియల్మీ చైనా ప్రెసిడెంట్ జూ కీ చేస్
  • 24జిబి ర్యామ్ తో వస్తోన్న రియల్మీ యొక్క మొదటి ఫోన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ త్వరలోనే తన తదుపరి ఫ్లాగ్షిప్ ని లాంచ్ చేయనుంది. Realme GT 5 అనే పేరుతో వస్తోన్న ఈ డివైజ్ మరికొన్ని రోజుల్లో లాంచ్ కానుందని సమాచారం. రియల్మీ చైనా ప్రెసిడెంట్ జూ కీ చేస్.. Realme GT 5 డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ తో రానుందని హింట్ ఇచ్చారు. Realme GT 5 స్మార్ట్ ఫోన్ 24జిబి ర్యామ్ తో వస్తోందని మరోవైపు టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ తెలిపింది.

Realme GT 5 లాంచ్ టీజర్

చైనాకు చెందిన సోషల్ మీడియా మాధ్యమం వీబో పై చేస్ ఒక పోస్టర్ ని షేర్ చేశారు. దీంతో చిప్సెట్ పై స్పష్టత వచ్చింది.

ఆయన పోస్ట్ ని బట్టి, Realme GT 5 డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ తో వస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రాలో కూడా ఇదే చిప్సెట్ వాడారు. అలాగే ఇవాళ లాంచ్ అవుతోన్న వన్‌ప్లస్ ఏస్ 2 ప్రో డివైజ్ లో కూడా ఈ ప్రాసెసర్ వినియోగించారు.

Realme GT 5 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Realme GT 5 లో 6.74-ఇంచ్ 1.5కే ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • చిప్సెట్: Realme GT 5 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వినియోగించనున్నారు.
  • ర్యామ్, స్టోరేజీ: Realme GT 5 స్మార్ట్ ఫోన్ లో 24జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీని అందిస్తున్నారు.
  • ఓఎస్: Realme GT 5 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Realme GT 5 స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50 మెగా పిక్సెల్ సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయని అంచనా. ఇంకా సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందిస్తున్నారు.
  • బ్యాటరీ: Realme GT 5 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ అందిస్తున్నారు. ఇది 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. అయితే 5200 ఎంఏహెచ్ బ్యాటరీ + 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ గల మరొక వేరియంట్ కూడా అందుబాటులో ఉంటుంది.
  • కనెక్టివిటీ: Realme GT 5 స్మార్ట్ ఫోన్ లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి.

త్వరలోనే రియల్మీ జీటీ 5 భారత లాంచ్ కి సంబంధించిన వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఆమేరకు కంపెనీ నుంచి ఒక ప్రకటన వస్తుందని ఆశిద్దాం.

Previous articleభారత్‌లో లాంచైన Motorola E13 8GB ర్యామ్ వేరియంట్; ధర రూ.8,999 మాత్రమే!
Next articleTDRA సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన Motorola G84
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.