Home News Motorola Edge 30 Ultra: ప్రపంచపు తొలి 200ఎంపి కెమెరా ఫోన్ తో తీసిన ఫస్ట్ పిక్ ఇదిగో..!!

Motorola Edge 30 Ultra: ప్రపంచపు తొలి 200ఎంపి కెమెరా ఫోన్ తో తీసిన ఫస్ట్ పిక్ ఇదిగో..!!

హైలైట్స్:

 

లాంచ్ కి ముందు మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా కెమెరా శాంపిల్ లీక్ అయ్యింది. దీంతో 200ఎంపి భారీ సెన్సర్ నుంచి మనం ఏం ఆశించవచ్చో తెలిసినట్లైంది. శాంసంగ్ తయారు చేసిన 200ఎంపి ఐసోసెల్ హెచ్పీ1 సెన్సర్ ను వినియోగించనున్నట్లు మోటోరోలా ఇదివరకే కన్ఫర్మ్ చేసింది. తాజాగా మోటోరోలా యొక్క చైనా జనరల్ మేనేజర్ చెన్ జిన్ వీబో ద్వారా మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా కెమెరా శాంపిల్ ను షేర్ చేశాడు. ఇక ఈ ఫోన్ ఈ నెలలోనే చైనాలో లాంచ్ అవుతోంది. 200ఎంపి కెమెరాతో వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా కావడం విశేషం. దీంతో ఈ ఫోన్ కెమెరాపై అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఫోన్ ధర, ఇతర వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

Motorola Edge 30 Ultra కెమెరా శాంపిల్

పైన కనిపిస్తున్న ఇమేజ్ సెన్సర్ యొక్క 4-ఇన్-1 పిక్సెల్ ప్రాసెసింగ్ వాడుకుని, 50ఎంపి రెజుల్యూషన్ వద్ద క్యాప్చర్ చేయబడింది. వీబో అనే సామాజిక మాద్యమంలో షేర్ చేయబడినది కావున, ఈ పిక్ కచ్చితంగా కంప్రెస్ కాబడినదని అర్థం చేసుకోవాలి. 108ఎంపి కెమెరాలు సపోర్ట్ చేసే 9-ఇన్-1 పిక్సెల్ ప్రాసెసింగ్ తో పోల్చితే, మోటో 200ఎంపి యొక్క 4-ఇన్-1 పిక్సెల్ ప్రాసెసింగ్ ఎంతో ఉత్తమమైనదని మోటోరోలా కంపెనీ చెబుతోంది. ఇక కెమెరా శాంపిల్ 13ఎంబి సైజుకి మార్చబడినది.

Motorola Edge 30 Ultra స్పెసిఫికేషన్స్

మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా ఫోన్ 6.73-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. అలాగే స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ ను ఈ ఫోన్లో అమర్చారు. ఇప్పుడు బ్యాటరీ విభాగంపై ఓ కన్నేద్దాం పదండి. మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా ఫోన్ 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 125 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. ఇప్పుడు ర్యామ్, స్టోరేజీ సంగతి చూద్దాం. ఈ ఫోన్ 12జిబి ర్యామ్, 256 జిబి స్టోరేజీ కలిగి ఉంది.

మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా యొక్క కెమెరా విభాగం విశేషాలు ఇక్కడ చూద్దాం. ఈ ఫోన్లో 200ఎంపి ప్రైమరీ కెమెరాను అమర్చారు. అలాగే 50 మెగా పిక్సెల్ సెకండరీ కెమెరా, 12 మెగా పిక్సెల్ థర్డ్ సెన్సర్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 60ఎంపి కెమెరా ఉంది. VLOGS చేసే వారికి ఈ 60ఎంపి కెమెరా ఎంతో ఉపయోగపడనుంది. ఇకపోతే, ఎడ్జ్ 30 అల్ట్రా ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత, మైయూఎక్స్ కస్టమ్ ఓఎస్ పై పని చేయనుంది.