144Hz డిస్ప్లే తో వస్తున్న Motorola Edge 30 Ultra

హైలైట్స్:

* 6.67-ఇంచ్ 144Hz డిస్ప్లే తో వస్తున్న Motorola Edge 30 Ultra

* 200MP ప్రైమరీ కెమెరా ఉండనుందని అంచనా

* 125W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, రెండు కలర్ ఆప్షన్స్ తో వస్తున్న ఎడ్జ్ 30 అల్ట్రా

త్వరలోనే మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా స్మార్ట్ ఫోన్ లాంచ్ అవ్వనున్నట్లు లీక్స్ ద్వారా తెలుస్తోంది. తాజాగా 91మొబైల్స్ హిందీ కథనం ఈ ఫోన్ యొక్క డిస్ప్లే స్పెసిఫికేషన్స్, కలర్, మెమొరీ వేరియంట్స్ ని కన్ఫర్మ్ చేస్తోంది. లీక్స్ ని బట్టి, మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉండనున్నట్లు అర్థమవుతోంది. దీంతో మోటోరోలా ఫ్లాగ్ షిప్ సెగ్మెంట్ లో మరింత పటిష్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Motorola Edge 30 Ultra: ఇప్పటి వరకు రివీల్ అయిన ముఖ్యమైన ఫీచర్లు

మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా కి సంబంధించిన ఎన్నో స్పెసిఫికేషన్లు ఇప్పటికి విడుదలయ్యాయి. తాజాగా ఈ ఫోన్ 6.67 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉండనున్నట్లు ఓ సమాచారం బయటకు వచ్చింది. ఇప్పుడొస్తున్న ప్రీమియమ్ సెగ్మెంట్ ఫోన్స్ లో ఈ డిస్ప్లే రెజుల్యూషన్ తక్కువనే చెప్పాలి. అలాగే ఇప్పటి వరకు మోటోరోలా నుంచి వచ్చిన అన్ని స్మార్ట్ ఫోన్స్ లో కెల్లా ఇదే హయ్యస్ట్ వేరియంట్ అనేది గమనించాలి. దాన్ని బట్టి ఈ ఫోన్ కూడా భారీ డిస్ప్లే ను కలిగి ఉంటే బాగుండేది.

ఇక ఇతర ముఖ్యమైన స్పెసిఫికేషన్లను ఓసారి పరిశీలిస్తే, మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, వైట్, గ్రే కలర్ ఆప్షన్స్, స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 125 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉంటాయి.

ఇప్పటికే పలు కథనాలను బట్టి, మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా భారీ ప్రధాన కెమెరాతో రానుందని స్పష్టమైంది. ఇది 1/1.22-ఇంచ్ సైజులో ఉంటుందని, శాంసంగ్ ISOCELL HP1 ఇమేజ్ సెన్సర్ అని సమాచారం. ఇక 200MP ఇమేజ్ సెన్సర్ కలిగిన మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా ఈ కెమెరా కలిగిన తొలి స్మార్ట్ ఫోన్ గా నిలవనుంది.

ఇతర స్పెసిఫికేషన్స్ పై ఓ కన్నేద్దాం. ఈ ఫోన్లో 50MP సెకండరీ కెమెరా, 12MP థర్డ్ సెన్సర్ ఉంటాయి. ఇక టెలీఫోటో లెన్స్ ఉంటుందో లేదో ఇంకా తెలియదు. ఎడ్జ్ 30 అల్ట్రా యొక్క ప్రధాన కెమెరా లెన్స్ 50ఎంఎం ఉంటుందని, మిగతా రెండు 35ఎంఎం, 85ఎంఎం ఫోకల్ లెంగ్త్ ఉంటాయని పలు కథనాలు చెబుతున్నాయి. ఇవన్నీ స్మార్ట్ ఫోన్ ఫోటోగ్రఫీలో విభిన్నమైన లెన్సెస్ అని చెప్పవచ్చు. కానీ, పోట్రెయిట్ ఫోటోగ్రఫీని టార్గెట్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

Motorola Edge 30 Ultra లాంచ్ టైమ్ లైన్

వస్తోన్న ఊహాగానాలను బట్టి, ఈ ఫోన్ ముందు భాగాన 60MP కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అలాగే 144 హెర్ట్జ్ డిస్ప్లే, హెచ్డీఆర్10+ సర్టిఫికేషన్ కూడా ఉండనున్నట్లు సమాచారం. ఈ నెలలోనే ఫోన్ లాంచ్ అవ్వనున్నట్లు అంచనా వేస్తున్నారు. అలాగే అతి త్వరలో బ్రాండ్ నుంచి పలు టీజర్లు కూడా విడుదలవ్వడం ఖాయమని తెలుస్తోంది. మరి మోటోరోలా పేరెంట్ కంపెనీ అయిన లెనోవో ఈ ఫోన్ ని ఏయే మార్కెట్లలో లాంచ్ చేస్తుందో చూడాలి. ఇప్పటికే గత రెండు వేరియంట్స్ ఇండియాలో లాంచ్ అయిపోయాయి.

Previous articleస్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో రానున్న Samsung Galaxy S23 సిరీస్
Next articleలాంచ్ అయిన Realme GT 2 Master Explorer ఎడిషన్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.