
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO నేడు భారతీయ మార్కెట్ లో POCO M6 Plus 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో 108ఎంపి కెమెరా, 8జిబి ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి పోకో ఎమ్6 ప్లస్ 5జీ యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
POCO M6 Plus 5G ధర, లభ్యత, కలర్స్
POCO M6 Plus 5G స్మార్ట్‌ఫోన్ రెండు ర్యామ్ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
POCO M6 Plus 5G యొక్క 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ బేస్ మోడల్ ధరను రూ.13,499 గా పెట్టారు. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ టాప్ వేరియంట్ ధర రూ.14,499 గా ఉంది. ఆగస్టు 5వ తేదీ నుంచి ఈ ఫోన్‌ని ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఐస్ సిల్వర్, మిస్టీ ల్యావెండర్ మరియు గ్రాఫైట్ బ్లాక్ కలర్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.
POCO M6 Plus 5G కొనేవారికి రూ.1000 బ్యాంక్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఇంకా 6జిబి ర్యామ్ వేరియంట్ పై రూ.500 కూపన్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఆఫర్స్ తో కలుపుకుని రెండు ఫోన్లు వరుసగా రూ.11,999 మరియు రూ.13,499 కి లభించనున్నాయి. రూ.1000 ఆఫర్ పొందేందుకు ఎస్బీఐ, హెచ్డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్స్ వాడాల్సి ఉంటుంది.
POCO M6 Plus 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: POCO M6 Plus 5G లో6.79-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 550 నిట్స్ బ్రైట్నెస్, ఎల్సీడీ ప్యానెల్, 2400 * 1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ఉంటాయి.
ప్రాసెసర్: POCO M6 Plus 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. ఇది 8-కోర్ ప్రాసెసర్. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.3 గిగాహెర్ట్జ్.
మెమొరీ: POCO M6 Plus 5G డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. 8జిబి వర్చువల్ ర్యామ్ ను ఈ ఫోన్ లో అందించారు.
సాఫ్ట్‌వేర్: POCO M6 Plus 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 2 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.
బ్యాటరీ: POCO M6 Plus 5G లో పవర్ బ్యాకప్ కోసం 5030 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ: POCO M6 Plus 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
ఇతర ఫీచర్లు: POCO M6 Plus 5G లో ఐపీ53 ప్రొటెక్షన్, 3.5ఎంఎం ఆడియో జాక్, సింగిల్ స్పీకర్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, బ్లూటూత్ 5, 5గిగాహెర్ట్జ్ వై-ఫై, ఐఆర్ బ్లాస్టర్, 7 5జీ బ్యాండ్స్ ఉన్నాయి.











