
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola గ్లోబల్‌గా Edge 50 Ultra మరియు Edge 50 Fusion ఫోన్లను లాంచ్ చేసింది. భారత్ లో మోటోరోలా ఏప్రిల్ 3న Edge 50 Pro 5G ని లాంచ్ చేసింది. గ్లోబల్ మార్కెట్స్ లోకి వచ్చిన ఎడ్జ్ 50 అల్ట్రా మరియు ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్లు కర్వ్డ్ డిజైన్, ఏఐ ఫీచర్లతో వచ్చాయి. ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం పదండి.
Motorola Edge 50 Ultra స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Motorola Edge 50 Ultra లో 6.7-ఇంచ్ పీఓఎల్ఈడీ కర్వ్డ్ స్క్రీన్, 2712*1220 పిక్సెల్స్ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2500 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఉన్నాయి.
ప్రాసెసర్: Motorola Edge 50 Ultra లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ వాడారు.
ర్యామ్, స్టోరేజీ: Motorola Edge 50 Ultra డివైజ్ 12జిబి/16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి/1టిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
కెమెరా: Motorola Edge 50 Ultra లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 64ఎంపి పెరిస్కోప్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ: Motorola Edge 50 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
సాఫ్ట్‌వేర్: Motorola Edge 50 Ultra డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది.
ఇతర ఫీచర్లు: Motorola Edge 50 Ultra లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్, ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఏఐ ఫీచర్ ఉన్నాయి.
Motorola Edge 50 Fusion స్పెసిఫికేషన్స్
స్క్రీన్: Motorola Edge 50 Fusion లో 6.7-ఇంచ్ పీఓఎల్ఈడీ డిస్ప్లే, ఫుల్‌హెచ్డీ+ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
ప్రాసెసర్: Motorola Edge 50 Fusion లో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ ఉంది. లాటిన్ అమెరికా ఎడిషన్ లో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ ఉంది.
కెమెరా: Motorola Edge 50 Fusion లో 50ఎంపి ఎల్‌వైటీ-700సీ ఓఐఎస్ మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ: Motorola Edge 50 Fusion లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 68 వాట్ టర్బోపవర్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
సాఫ్ట్‌వేర్: Motorola Edge 50 Fusion డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది.
ఇతర ఫీచర్లు: Motorola Edge 50 Fusion లో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఏఐ ఫీచర్, డ్యూయల్ సిమ్ 5జీ, బ్లూటూత్, వై-ఫై, ఐపీ68 రేటింగ్ ఉన్నాయి.
Moto Edge 50 Ultra, Motorola Edge 50 Fusion ధరలు
మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా రానున్న రోజుల్లో యురోపియన్ మార్కెట్స్ లోకి సేల్‌కి రానుంది. బేస్ మోడల్ ధర 1000 యూరోలు (సుమారు రూ.88,993) గా ఉంది.
మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా డివైజ్ నార్డిక్ వుడ్, ఫారెస్ట్ గ్రే మరియు పీచ్ ఫజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ రెండింట్లో ఒకటి వుడ్ ఫినిష్ బ్యాక్‌తో వస్తోంది. మరొకటి వీగన్ లెదర్ బ్యాక్ తో వస్తోంది.
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ప్రారంభ ధర 349 యూరోలు (సుమారు రూ.31,057) గా ఉంది. ఈ ఫోన్ ఫారెస్ట్ బ్లూ, హాట్ పింక్ మరియు మార్ష్‌మాలో బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.











