Home Featured Motorola Edge 50 vs Realme 13 Pro: ఏ ఫోన్ బ్యాటరీ మెరుగైనది?

Motorola Edge 50 vs Realme 13 Pro: ఏ ఫోన్ బ్యాటరీ మెరుగైనది?

స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం.

Motorola Edge 50 మరియు Realme 13 Pro ఫోన్ల బ్యాటరీ పనితనాన్ని మేం కొన్ని టెస్టులు చేసి పరీక్షించాం. ఆ వివరాలను మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

మోటోరోలా ఎడ్జ్ 50 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. మరోవైపు రియల్మీ 13 ప్రో లో 5200 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

పీసీమార్క్ టెస్ట్

పీసీమార్క్ బెంచ్‌మార్క్ టెస్ట్ లో 80 శాతం బ్రైట్నెస్ సెట్టింగ్స్‌తో, స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ 100 శాతం నుంచి 20 శాతానికి ఎంత టైమ్‌లో డ్రాప్ అవుతుందనే విషయం పరీక్షించబడుతుంది. మోటోరోలా ఎడ్జ్ 50 స్మార్ట్‌ఫోన్‌కి 10 గంటల 59 నిమిషాల సమయం పట్టింది. మరోవైపు, రియల్మీ 13 ప్రో డివైజ్‌కి 10 గంటల 48 నిమిషాల సమయం పట్టింది.

పీసీమార్క్ బ్యాటరీ టెస్టు ఫలితాల ప్రకారం, మోటోరోలా ఎడ్జ్ 50 కాస్త బెటర్ బ్యాటరీ లైఫ్ ఆఫర్ చేస్తుంది. కానీ, ఈ తేడా అనేది చాలా తక్కువ అనే విషయం గమనించాలి.

విజేత: Motorola Edge 50

వీడియో స్ట్రీమింగ్ టెస్ట్

రెండు ఫోన్లలో యూట్యూబ్ వీడియోలను 50 శాతం బ్రైట్నెస్‌ మరియు వాల్యూమ్ సెట్టింగ్స్‌తో 30 నిమిషాల పాటు చూడటం జరిగింది. టెస్ట్ తర్వాత, మోటోరోలా ఎడ్జ్ 50 బ్యాటరీ 5 శాతం (250ఎంఏహెచ్) డ్రాప్ అయ్యింది. మరోవైపు రియల్మీ 13 ప్రో బ్యాటరీ 4 శాతం (208ఎంఏహెచ్) డ్రాప్ అయ్యింది.

వీడియో స్ట్రీమింగ్ టెస్ట్ లో రియల్మీ 13 ప్రో యొక్క బ్యాటరీ ఎక్కువ సామర్థ్యం కలిగి ఉన్నట్లు తేలింది. మోటోరోలా ఎడ్జ్ 50 లో కాస్త ఎక్కువగా బ్యాటరీ డ్రాప్ అనేది కనిపించింది.

విజేత: Realme 13 Pro

గేమింగ్ టెస్ట్

రెండు ఫోన్లలో మేం, బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ: మొబైల్ మరియు రియల్ రేసింగ్ 3 గేమ్‌లను, ఒకే విధమైన వాల్యూమ్ మరియు బ్రైట్నెస్ సెట్టింగ్స్‌తో ఆడటం జరిగింది. మోటోరోలా ఎడ్జ్ 50 బ్యాటరీ 26 శాతం ఖర్చయ్యింది. మరోవైపు, రియల్మీ 13 ప్రో బ్యాటరీ 21 శాతం ఖర్చయ్యింది.

మరోసారి, మోటోరోలా ఎడ్జ్ 50 తన నాసీరకపు థర్మల్ మేనేజ్మెంట్ వల్లన బ్యాటరీ పవర్‌ని ఎక్కువగా నష్టపోయింది.

విజేత: Realme 13 Pro

చార్జింగ్ స్పీడ్

మోటోరోలా ఎడ్జ్ 50 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. రియల్మీ 13 ప్రో లో 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అందించారు. 20 శాతం నుచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు మోటోరోలా ఎడ్జ్ 50 కి 40 నిమిషాల సమయం పట్టింది. మరోవైపు, రియల్మీ 13 ప్రో డివైజ్‌కి 52 నిమిషాల సమయం పట్టింది.

రియల్మీ 13 ప్రో కంటే 12 నిమిషాలు ముందుగానే 100 శాతం చార్జ్ అయ్యి మోటోరోలా ఎడ్జ్ 50 విజేతగా నిలిచింది.

విజేత: Motorola Edge 50

ఏది బెటర్?

మోటోరోలా ఎడ్జ్ 50 మరియు రియల్మీ 13 ప్రో ఫోన్ల యొక్క బ్యాటరీలను పోల్చి చూశాక, రెండూ కూడా సమానమైన ఫలితాలను రాబట్టాయి. అయితే రియల్మీ 13 ప్రో కంటే మోటోరోలా ఎడ్జ్ 50 లో చార్జింగ్ స్పీడ్ ఎక్కువగా ఉండటం ప్లస్. మరోవైపు, రియల్మీ 13 ప్రో బ్యాటరీ త్వరగా డ్రాప్ అవ్వకుండా మేటిగా నిలిచింది. మంచి బ్యాటరీ లైఫ్ గల స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, మోటోరోలా ఎడ్జ్ 50 మరియు రియల్మీ 13 ప్రో ఫోన్లు రెండూ కూడా మంచి ఆప్షన్స్ గా నిలుస్తాయి. రియల్మీ 13 ప్రో బ్యాటరీ నిదానంగా డ్రాప్ అవుతుంది. మోటోరోలా ఎడ్జ్ 50 బ్యాటరీ త్వరగా చార్జ్ అవుతుంది. ప్రధాన తేడా ఇక్కడే ఉంది. మీకు అవసరానికి తగిన ఫోన్ ఎంచుకోండి.

స్మార్ట్‌ఫోన్లను టెస్ట్ చేసిన వారు: ఉజ్వల్ శర్మ