Motorola: బీఐఎస్ వెబ్‌సైట్ పై లిస్టైన Razr 50 Ultra

Highlights

  • త్వరలో Motorola Razr 50 Ultra లాంచ్
  • బీఐఎస్ పై లిస్టైన రేజర్ 50 అల్ట్రా ఫ్లిప్ ఫోన్
  • Razr 50 Ultra మోడల్ నంబర్ XT2453-1

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నుంచి త్వరలో Razr 50 సిరీస్ లాంచ్ కానుంది. గతేడాది లాంచైన రేజర్ 40 సిరీస్ కి ఇది సక్సెసర్ గా వస్తోంది. ఈ సిరీస్ లో Motorola Razr 50 మరియు Motorola Razr 50 Ultra అనే ఫ్లిప్‌ ఫోన్లు లాంచ్  అవ్వబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికార ప్రకటన వెలువడలేదు. తాజాగా Motorola Razr 50 Ultra భారత్‌కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

Motorola Razr 50 Ultra బీఐఎస్ లిస్టింగ్

Motorola Razr 50 Ultra డివైజ్ బీఐఎస్ లిస్టింగ్ పై XT2453-1 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఈ విషయాన్ని 91mobiles గుర్తించింది.

గత మోడల్ Motorola Razr 40 Ultra XT2321-1 అనే మోడల్ నంబర్‌ని కలిగి ఉంది. దీంతో బీఐఎస్ పై లిస్టైన ఫోన్ Motorola Razr 50 Ultra అని భావిస్తున్నారు.

బీఐఎస్ లిస్టింగ్ ద్వారా ఫోన్‌కి సంబంధించిన ఏ వివరాలు కూడా రివీల్ కాలేదు. కానీ, డివైజ్ కొన్ని నెలల్లో లాంచ్ అవ్వనుందని ఈ లిస్టింగ్ ద్వారా అర్థమవుతోంది.

Motorola Razr 50 Ultra వివరాలు (లీక్)

ఓ లీక్ ప్రకారం, Motorola Razr 50 Ultra ఫ్లిప్‌ ఫోన్ యొక్క కోడ్ నేమ్ మోటోరోలా గ్లోరీ అని ఉంది. అలాగే రెండర్ కూడా షేర్ అయ్యింది.

రెండర్ ప్రకారం, Motorola Razr 50 Ultra క్లాసిక్ గ్రే కలర్, స్లిమ్ డిజైన్ మరియు ఫ్లెక్సిబుల్ బిల్డ్ తో ఉన్నట్లు తెలుస్తోంది.

Motorola Razr 50 Ultra ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ తో రానుందని అంచనా వేస్తున్నారు.

Motorola Razr 40 Ultra స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Motorola Razr 40 Ultra లో 6.9-ఇంచ్ ఎల్టీపీవో ఓఎల్ఈడీ ప్రైమరీ స్క్రీన్, 3.6-ఇంచ్ కవర్ డిస్ప్లే ఉంది.

ప్రాసెసర్: Motorola Razr 40 Ultra లో స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ వాడారు.

కెమెరా: Motorola Razr 40 Ultra డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 12ఎంపి + 13ఎంపి కెమెరా సెన్సర్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Motorola Razr 40 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 3800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 30 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 5 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.