Infinix: మే 21న భారత్‌లో లాంచ్ అవుతోన్న Infinix GT 20 Pro, GTBook ల్యాప్‌టాప్

Highlights

  • Infinix GT 20 Pro ఇండియా లాంచ్ తేదీ ఖరారు
  • ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్
  • మ్యాగ్‌కేస్, ఫింగర్ స్లీవ్స్‌తో వస్తోన్న ఫోన్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix త్వరలో ఒక కొత్త జీటీ సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Infinix GT 20 Pro పేరుతో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్ ఇండియా లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. మే 21న ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతోంది. అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ బ్రైట్నెస్ తో ఈ ఫోన్ వస్తోంది. ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ఇండియా లాంచ్ వివరాలు తెలుసుకుందాం.

Infinix GT 20 Pro ఇండియా లాంచ్ తేదీ

Infinix GT 20 Pro స్మార్ట్‌ఫోన్ భారత్ లో మే 21వ తేదీన లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ తో పాటు GTBook కూడా లాంచ్ అవుతోంది.

జీటీ వర్స్ గేమింగ్ యాక్ససరీస్ అయిన మ్యాగ్‌కేస్, ఫింగర్ స్లీవ్స్, కూలింగ్ ఫ్యాన్, ఆర్జీబీ మ్యాట్, ఆర్జీబీ హెడ్‌ఫోన్స్ మరియు ఆర్జీబీ మౌస్ తో ఈ ఫోన్ వస్తోంది. సైబ్ మెకా డిజైన్, మెకా లూప్-ఎల్ఈడీ ఇంటర్‌ఫేస్, గేమ్ లైటింగ్ ఎఫెక్ట్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Infinix GT 20 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Infinix GT 20 Pro 5జీ ఫోన్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, పిక్సెల్‌వర్క్స్ ఎక్స్5 టర్బో గేమింగ్ డిస్ప్లే చిప్సెట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Infinix GT 20 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్టిమేట్ చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ610 ఎంసీ6 జీపీయూ వినియోగించారు.

ర్యామ్, స్టోరేజీ: Infinix GT 20 Pro డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని కలిగి ఉంది.

ఓఎస్: Infinix GT 20 Pro ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: Infinix GT 20 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ఓఐఎస్ శాంసంగ్ హెచ్ఎమ్6 మెయిన్ సెన్సర్, 2ఎంపి డెప్త్, 2ఎంపి మ్యాక్రో కెమెరా (మినీ ఎల్ఈడీతో) ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Infinix GT 20 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Infinix GT 20 Pro లో ఐపీ54 స్ప్లాష్ మరియు డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్‌ని కలిగి ఉంది.