Vivo Y18s: 6జిబి ర్యామ్‌తో గ్లోబల్‌గా లాంచైన వివో వై18ఎస్

Highlights

  • వియత్నాంలో Vivo Y18s లాంచ్
  • 12GB ర్యామ్, 5000mAh బ్యాటరీ
  • మీడియాటెక్ హీలియో జీ85 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి వై-సిరీస్ లో కొత్త ఫోన్ గ్లోబల్‌గా లాంచ్ అయ్యింది. Vivo Y18s పేరుతో వచ్చిన ఈ ఫోన్ వియత్నాంలో లాంచ్ అయ్యింది. 12జిబి ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి రియర్ కెమెరా, ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రేటింగ్ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vivo Y18s ధర

Vivo Y18s డివైజ్ స్పెసిఫికేషన్స్ కంపెనీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యాయి. కానీ, ధర మాత్రం రివీల్ కాలేదు.

కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ మోచా బ్రౌన్ మరియు ఓషన్ బ్లూ కలర్స్ లో లభిస్తుంది.

కొన్ని రోజుల క్రితమే భారత్ లో Vivo Y18 లాంచ్ అయ్యింది. ఇదే ఫోన్ వియత్నాంలో Vivo Y18s పేరుతో 6జిబి ర్యామ్ తో లాంచ్ అయ్యింది.

భారత్ లో లాంచైన Vivo Y18 డివైజ్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ (రూ.8,999) మరియు 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ (రూ.9,999) ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది.

Vivo Y18s స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y18s లో 6.56-ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్, 840 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y18s లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు. ఇది 12 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2GHz.

ర్యామ్, స్టోరేజీ: Vivo Y18s డివైజ్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్ తో లాంచ్ అయ్యింది. 6జిబి వర్చువల్ ర్యామ్ ని ఈ ఫోన్ లో అందించారు.

కెమెరా: Vivo Y18s లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 0.08ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Vivo Y18s లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Vivo Y18s డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Vivo Y18s డివైజ్ లో ఐపీ54 రేటింగ్, డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ వంటి ఫీచర్లు ఉన్నాయి.