త్వరలో లాంచ్ కానున్న Motorola ThinkPhone

హైలైట్స్

  • మార్కెటింగ్ మెటీరియల్స్ ద్వారా లీకైన Motorola ThinkPhone స్పెసిఫికేషన్స్
  • త్వరలోనే లాంచ్ కానున్న Motorola ThinkPhone స్మార్ట్ ఫోన్
  • క్వాల్కమ్ స్పాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 50ఎంపి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తోన్న Motorola ThinkPhone

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటోరోలా త్వరలోనే ThinkPhone సిరీస్ లో ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుందని సమాచారం. మోటోరోలా పేరెంట్ కంపెనీ అయిన లెనొవొ తాజాగా థింక్ ప్యాడ్ సిరీస్ ల్యాప్ టాప్స్ ని బిజినెస్ సెంట్రిక్ కస్టమర్ల కోసం లాంచ్ చేసింది. అయితే ప్రమోషనల్ పోస్టర్స్ లో వాటితో పాటు ఫోన్ కూడా ఉంది. దీంతో Motorola ThinkPhone లాంచ్ అవ్వనుందని స్పష్టమైంది. అయితే మోటోరోలా ఇంతవరకు ఈ ఫోన్ గురించి ఏ విషయం చెప్పలేదు. అలాగే ఫోన్ మోటోరోలా మరియు లెనొవొ బ్రాండ్స్ లో ఏ పేరుతో లాంచ్ అవుతుందో చూడాలి.

ప్రముఖ టిప్‌స్టర్ Snoopy Tech థింక్ ఫోన్ యొక్క మార్కెటింగ్ మెటీరియల్ ని అప్‌లోడ్ చేయడంతో ఫోన్ యొక్క డిజైన్, స్పెసిఫికేషన్స్ గురించి తెలిసింది. ThinkPhone ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్, ఎడమవైపున రెడ్ బటన్ తో వస్తోంది. ఈ బటన్ యొక్క ఉపయోగం ఏంటో ఇంకా తెలియదు. ఇమేజెస్ ని బట్టి ఫోన్ ని లెనొవొ ల్యాప్‌టాప్ తో కనెక్టి చేసుకోవచ్చని తెలుస్తోంది. కనెక్ట్ డిస్ప్లే, మిర్రర్ ఫోన్, వెబ్ క్యామ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి.

దీనికి అదనంగా యూజర్లు తమ ఇన్ కమింగ్ కాల్స్, మెసేజెస్ కి రెస్పాండ్ కావడంతో పాటు, మ్యూజిక్ ని కంట్రోల్ చేయవచ్చు. వీటిలో కొన్ని ఫీచర్లు మనం గెలాక్సీ ఫోన్లు, ల్యాప్ టాప్స్ లలో డెక్స్ మోడ్ ద్వారా అనుభూతి చెందిన వాటిలా ఉన్నాయి.

Motorola ThinkPhone డిజైన్, స్పెసిఫికేషన్స్

ThinkPhone యొక్క డిజైన్ మరియు స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడితే, Motorola ThinkPhone స్మార్ట్ ఫోన్ కర్వ్డ్ రియర్ ప్యానెల్, ఐపీ రేటింగ్, టెక్చర్డ్ బ్యాక్ ఫినిషింగ్ తో వస్తోంది.

Motorola ThinkPhone లో స్క్వేర్ షేప్డ్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది. ఇందులో 50 ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. దీంతో పాటు ఒక అల్ట్రావైడ్ మరియు మ్యాక్రో కెమెరా ఉంటాయి. .5x, 1.0x వరకు జూమ్ చేసి మ్యాక్రో ఫోటోస్ తీసుకునే అవకాశం ఉంది. అయితే థర్డ్ సెన్సర్ మ్యాక్రో కెమరానా? లేక డెప్త్ సెన్సరా? అనేది తెలియాల్సి ఉంది. ఈ ఫోన్ లో 13ఎంపి అల్ట్రావైడ్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయని ఇటీవలె ఓ రిపోర్ట్ ద్వారా తెలిసింది.

ఫోన్ ముందువైపు గమనిస్తే, డిస్ప్లే ఫ్లాట్ గా ఉండి, సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్ తో ఉంది. డిస్ప్లే నలువైపులా పర్వాలేదనిపించేలా బెజెల్స్ ఉన్నాయి. ఫోన్ కి కుడివైపున పవర్ మరియు వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి.

టిప్‌స్టర్ Snoopy Tech ప్రకారం, Motorola ThinkPhone క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో రానున్నట్లు సమాచారం. ఇప్పుడు ఇది ఎంట్రీ లెవెల్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ గా మారిపోయింది. ఇకపోతే థింక్ ఫోన్ 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ తో వస్తోంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేయనుంది.

Motorola ThinkPhone 6.6-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 32ఎంపి ఫ్రంట్ కెమెరా తో వస్తోంది. ఈ ఫోన్ 158.7 మిల్లీ మీటర్ల పొడవు, 74.4 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.3 మిల్లీ మీటర్ల మందం, 189 గ్రాముల బరువు ఉంటుంది. జనవరి 5 న లాస్ వెగాస్ లో జరిగే కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో లో ThinkPhone లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.