టెస్టింగ్‌ కి వచ్చి కెమెరా కంటికి చిక్కిన Nissan Ariya e-SUV

Highlights

  • టెస్టింగ్ కి వచ్చి కెమెరా కంటికి చిక్కిన Nissan Ariya e-SUV
  • Renault-Nissan జాయింట్ వెంచర్ లో భాగం 2025 నుంచి రానున్న సరికొత్త ఐసీఈ కార్లు మరియు ఎలక్ట్రిక్ వెహికిల్స్
  • భారీ ఎత్తున స్థానిక విడి భాగాలను వాడి తక్కువ ధరలో Kwid EV ని తీసుకురానున్న Renault సంస్థ

మహారాష్ట్రలో రోడ్లపై కి టెస్టింగ్ కి వచ్చిన Nissan Ariya e-SUV కెమెరా కంటికి చిక్కింది. దీంతో Nissan Ariya e-SUV యొక్క ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. త్వరలోనే ఈ కారు భారత మార్కెట్ లో లాంచ్ కానుంది. అంతర్జాతీయ మార్కెట్ లో ఇప్పటికే అందుబాటులో ఉన్న Nissan Leaf EV కి పైన Nissan Ariya e-SUV ఉంటుంది.

Renault, Nissan కలిసి భారత మార్కెట్ లో రూ.5,300 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సదరు సంస్థలు ప్రకటించాయి. అలాగే ఇరు సంస్థలు కలిసి కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను 2025 తర్వాత భారత్ లో లాంచ్ చేయనున్నట్లు స్పష్టం చేసాయి.

Nissan Ariya e-SUV

Nissan Ariya e-SUV కారు Hyundai IONIQ 5 మరియు Kia EV6 వంటి కార్లతో అంతర్జాతీయ మార్కెట్స్ లో పోటీపడనుంది. ఇకపోతే Hyundai IONIQ, Kia EV6 కార్లు ఇప్పటికే భారత్ లో లాంచ్ అయ్యాయి. అలాగే వీటికి కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అందువల్లన జపనీస్ కార్ మేకర్ అయిన నిస్సాన్ భారత్ లో Nissan Ariya e-SUV ని లాంచ్ చేసిన రెస్పాన్స్ ఎలా ఉండనుందో చూస్తే మంచిది. అయితే, Nissan Ariya e-SUV లాంచ్ టైమ్‌లైన్ ని ఇంకా నిస్సాన్ ప్రకటించలేదు.

Nissan Ariya e-SUV రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో లభించనుంది. అవి: 63కిలోవాట్ అవర్ మరియు 87కిలోవాట్ అవర్. 63kWh బ్యాటరీ ప్యాక్ ని 217హెచ్‌పి పవర్, 300 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేసే మోటర్ కి అనుసంధానించారు. ఇది సింగిల్ చార్జ్ పై 402 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. 87kWh బ్యాటరీ ప్యాక్ ని 242హెచ్‌పి పవర్, 300ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేసే మోటర్ కి అనుసంధానించారు. ఇది సింగిల్ చార్జ్ పై 529 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. నిస్సాన్ సంస్థ 306హెచ్‌పి, 600ఎన్ఎం టార్క్ గల బ్యాటరీ ప్యాక్ తో మరొక టాప్ మోడల్ ని కూడా అభివృద్ధి చేస్తోంది.

Nissan Ariya e-SUV లో 12.3-ఇంచ్ భారీ తెర, బోస్ ప్రీమియమ్ సౌండ్ సిస్టమ్, హెడ్-అప్ డిస్ప్లే, 19-ఇంచ్ లేదా 20-ఇంచ్ వీల్స్, ఒక ఇల్యూమినేటెడ్ నిస్సాన్ లోగో, ఎల్ఈడీ లైటింగ్, డ్రైవర్ అసిస్టన్స్ ఫీచర్స్ తో వస్తోంది. Euro NCAP క్రాష్ టెస్ట్ లో Nissan Ariya e-SUV కి 5-Star రేటింగ్ వచ్చింది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleMediaTek Helio A22 చిప్, 5000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన Tecno POP 7 Pro
Next articleచవకైన DATA+OTT ప్లాన్ ని తీసుకొచ్చిన Airtel
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.