
సాలిడ్-స్టేట్ బ్యాటరీలతో కూడిన వాహనాలను 2028 కల్లా లాంచ్ చేయబోతున్నట్లు నిస్సాన్ కంపెనీ ప్రకటించింది. రేంజ్, తక్కువ చార్జింగ్ టైమ్, అగ్నిప్రమాదాలకు జరిగే అవకాశం తక్కువ, వైర్లెస్ చార్జింగ్ ప్రొవిజన్ వంటి ఫీచర్లు ఉంటాయని నిస్సాన్ తెలిపింది. జపాన్ యొకొహామా లోని నిస్సాన్ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ గ్యాలరీ లో నిస్సాన్ ఈ ప్రకటనను చేసింది.
సాలిడ్-స్టేట్ బ్యాటరీలు అంటే ఏమిటి? ఎందుకవి సురక్షితం?
నిస్సాన్ సంస్థ “ఎవాల్వడ్ సాలిడ్-స్టేట్ బ్యాటరీస్” పై పని చేస్తోంది. ఈ కొత్త తరం బ్యాటరీల ఉత్పత్తిని 2025 కల్లా ప్రారంభిస్తామని నిస్సాన్ చెబుతోంది. తన ప్రారంభ దశ అప్లికేషన్ ఇంజినీరింగ్ ప్రక్రియను ఈ జపనీస్ ఆటోమేకర్ 2026 వరకు పూర్తి చేయనుందని సమాచారం. తర్వాత వెహికిల్ అప్లికేషన్ 2028 లో పూర్తి కానుందని తెలుస్తోంది. నిస్సాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (రీసెర్చి అండ్ డెవలప్మెంట్, యూరప్) డేవిడ్ మాస్ ‘ఆటోకార్’ వెబ్ పోర్టల్ తో జరిపిన సంభాషణలో పైన పేర్కొనబడిన వివరాలు తెలిసాయి.
నిస్సాన్ కంపెనీ కొత్త తరం సాలిడ్-స్టేట్ బ్యాటరీలను (All-solid-state sodium batteries) అభివృద్ధి చేసేందుకు నడుం బిగించినట్లు డేవిడ్ మాస్ తెలిపారు. ఈ బ్యాటరీ ప్యాక్స్ సూపర్ ఫాస్ట్ చార్జింగ్ స్పీడ్స్ కలిగి ఉంటాయి. స్థిరంగా, కచ్చితత్వంతో ఉండే ఈ బ్యాటరీ ప్యాక్స్ వెహికిల్స్ లో తక్కువ పరిమాణంలోనే ఇమిడిపోయేలా ఉంటాయి.
సాధారణ 400 కిలోవాట్ చార్జింగ్ స్పీడ్స్ ని ఉదహరిస్తూ, సమతూకంగా బ్యాటరీలు విభిన్న చార్జర్స్ ని వివిధ వేగాల్లో కూడా యాక్సెప్ట్ చేస్తాయని నిస్సాన్ తెలిపింది. బాహ్యకారకాల వల్లన బ్యాటరీ పనితనంలో హెచ్చుతగ్గులు అనేవి ఉండవని నిస్సాన్ అభిప్రాయపడింది.
ఏదేమైనా, ఈ సరికొత్త బ్యాటరీలు వాహనాల ఆర్కిటెక్చర్ మరియు మానుఫక్చరింగ్ ఇకోసిస్టమ్ ని ఏలనున్నాయి. ప్రస్తుతం చేపట్టిన అభివృద్ధి పనులకు ఎటువంటి ఆటంకం లేకుండా, నిస్సాన్ సంస్థ ఏకకాలంలో వెహికిల్ డెవలప్మెంట్ మరియు బ్యాటరీ డెవలప్మెంట్ ని వేరువేరుగా ముందుకు తీసుకెళ్తోంది.
ప్రస్తుతం ఈ జపనీస్ ఆటోమేకర్ లిథియమ్ అయాన్ బ్యాటరీ టెక్నాలజీపై పని చేస్తోంది. 2028 కల్లా కోబాల్ట్-ఫ్రీ లిథియమ్ అయాన్ బ్యాటరీలను తయారు చేయడమే లక్ష్యంగా నిస్సాన్ ముందుకు సాగుతోంది. బ్యాటరీ ప్యాక్స్ ఖర్చును 65 శాతం మేర తగ్గించే అవకాశం ఉందని నిస్సాన్ చెబుతోంది.
నిస్సాన్ సంస్థ రానున్న 5 ఏళ్ళలో 15.6 బిలియన్ యూరోలను పెట్టుబడిగా పెట్టేందుకు నిస్సాన్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే నిస్సాన్ సంస్థ 7.8 బిలియన్ యూరోలను పెట్టుబడి పెట్టింది. మరోవైపు, ఫోర్డ్, టొయోటా, బీవైడీ వంటి సంస్థలు కూడా సాలిడ్-స్టేట్ బ్యాటరీలపై పని చేస్తున్నాయి. 2025 కల్లా తమ వాహనాల్లో ఈ బ్యాటరీలను సదరు సంస్థలు పరిచయం చేసే అవకాశం ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











