Best gaming phones: రూ.50,000 లోపు బెస్ట్ గేమింగ్ ఫోన్లు (ఆగస్టు 2024)

సీరియస్ గేమర్స్‌కి, రూ.50,000 బడ్జెట్ లో లభించే స్మార్ట్‌ఫోన్లు ఎంతో ముఖ్యమైనవని చెప్పవచ్చు. ఈ ధర శ్రేణిలో ఉండే ఫోన్లు పాపులర్ గేమ్స్ ని హ్యాండిల్ చేయగలిగే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. దీంతో యూజర్స్‌కి మంచి గేమింగ్ అనుభూతి లభిస్తుంది. అయితే, ఈ సెగ్మెంట్ లో ఒక సరైన ఫోన్‌ని ఎంచుకునే క్రమంలో కాస్త గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది.

అందుకోసమే, 91మొబైల్స్ టీమ్ రూ.50,000 లోపు లభించే కొన్ని స్మార్ట్‌ఫోన్ల యొక్క గేమింగ్ పెర్ఫామెన్స్‌ను టెస్ట్ చేసింది. ప్రత్యేకించి బీజీఎంఐ గేమ్‌ను ఈ ఫోన్లలో పరీక్షించింది. ఈ ఆర్టికల్ లో, రూ.50,000 లోపు ధరలో లభించే 5 గేమింగ్ స్మార్ట్‌ఫోన్ల యొక్క గేమింగ్ పెర్ఫామెన్స్, టెంపరేచర్, బ్యాటరీ డ్రాప్ వంటి వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

రూ.50,000 లోపు గేమింగ్ ఫోన్లు

  • iQOO Neo 9 Pro
  • Vivo V40 Pro
  • Realme GT 6
  • Realme GT 6T
  • Xiaomi 14 Civi

iQOO Neo 9 Pro

స్మార్ట్‌ఫోన్ రూ.50,000 లోపు ధరలో బెస్ట్-పెర్ఫామింగ్ ఫోన్. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.35,999 గా ఉంది. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ఉంది. ఈ ఫోన్ అంటుటు స్కోర్ 16,11,015 గా ఉంది. గీక్‌బెంచ్ పై సింగిల్-కోర్ టెస్ట్ లో 2,023 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 5,564 పాయింట్లు స్కోర్ చేసింది. ఈ ఫోన్ ఎంతో ఈజీగా ఎటువంటి గ్రాఫికల్ గేమ్స్‌నైనా రన్ చేస్తుంది.

iQOO Neo 9 Pro డివైజ్ లో 30 నిమిషాలు గేమ్ ఆడగా, టెంపరేచర్ 30.8 నుంచి 37.3 కి పెరిగింది. బ్యాటరీ 7 శాతం డ్రాప్ అయ్యింది. ఈ డివైజ్ మంచి గేమింగ్ అనుభూతిని అందించింది.

Vivo V40 Pro

Vivo V40 Pro ధర రూ.49,999 గా ఉంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్ వాడారు. 16జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని ఈ ఫోన్ లో అందించారు. ఈ ఫోన్ అంటుటు స్కోర్ 15,24,110 పాయింట్లుగా ఉంది. గీక్‌బెంచ్‌పై సింగిల్-కోర్ టెస్ట్ లో 1811 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 5,299 పాయింట్లు స్కోర్ చేసింది. ఈ ఫోన్ స్మూథ్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ ను అందిస్తుంది.

Vivo V40 Pro స్మార్ట్‌ఫోన్ లో 30 నిమిషాలు గేమ్ ఆడగా, టెంపరేచర్ 28.6 నుంచి 34.8 కి పెరిగింది. బ్యాటరీ 8 శాతం డ్రాప్ అయ్యింది. ఓవరాల్ గా ఈ ఫోన్ గేమింగ్‌ను బాగా హ్యాండిల్ చేసింది.

Realme GT 6

Realme GT 6 ఫోన్ ధర రూ.40,999 గా ఉంది. భారత్ లో ఉన్న బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఫోన్లలో ఇది ఒకటి. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్, 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ ఉన్నాయి. Realme GT 6 యొక్క అంటుటు స్కోర్ 15,01,830 పాయింట్లుగా ఉంది. గీక్‌బెంచ్ పై సింగిల్ కోర్ టెస్ట్ లో 1852 పాయింట్లు, మల్టీ కోర్ టెస్ట్ లో4761 పాయింట్లు స్కోర్ చేసింది.

Realme GT 6 డివైజ్ హయ్యస్ట్ గ్రాఫిక్స్ మరియు ఫ్రేమ్ రేట్ సెట్టింగ్స్ తో బీజీఎంఐని బాగా హ్యాండిల్ చేసింది.

Realme GT 6 ఫోన్ లో 30 నిమిషాలు గేమ్ ఆడగా, టెంపరేచర్ 30.6 నుంచి 34.7 కి చేరింది. బ్యాటరీ 6 శాతం డ్రాప్ అయ్యింది. ఓవరాల్‌గా, ఈ ఫోన్ సాలిడ్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించింది.

Realme GT 6T

Realme GT 6T ధర రూ.29,999 గా ఉంది. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ వాడారు. 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి. ఈ ఫోన్ అంటుటు స్కోర్ 14,50,949 గా ఉంది. గీక్‌బెంచ్‌పై సింగిల్-కోర్ టెస్ట్ లో 1826 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 4554 పాయింట్లు స్కోర్ చేసింది.

మేం జరిపిన టెస్టింగ్ లో, టెంపరేచర్ 34.9 నుంచి 29.32 కి పెరిగింది. బ్యాటరీ లెవెల్ 8 శాతం డ్రాప్ అయ్యింది. ఓవరాల్ గా గేమ్ ఆడుతున్నప్పుడు మెరుగైన పెర్ఫామెన్స్ అందించింది.

Xiaomi 14 Civi

Xiaomi 14 Civi స్మార్ట్‌ఫోన్ ధర రూ.42,999 గా ఉంది. ఈ ఫోన్ లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్, 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ ఉన్నాయి. ఈ ఫోన్ అంటుటు స్కోర్ 14,43,011 పాయింట్లుగా ఉంది. గీక్‌బెంచ్‌పై సింగిల్-కోర్ టెస్ట్ లో 1913 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 5087 పాయింట్లు స్కోర్ చేసింది. ఈ ఫోన్ బీజీఎంఐ వంటి అన్ని హెవీ గేమ్స్ ను బాగా హ్యాండిల్ చేస్తుంది.

Xiaomi 14 Civi లో 30 నిమిషాల పాటు గేమ్ ఆడాక, ఫోన్ టెంపరేచర్ 28.6 నుంచి 36 డిగ్రీలకు పెరిగింది. బ్యాటరీ 8 శాతం డ్రాప్ అయ్యింది.