
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Nokia భారత్ లో తన ఉత్పత్తులను పెంచుకుంటూ పోతోంది. తాజాగా ఈ సంస్థ భారత్ లో త్వరలో ఒక 5జీ ఫోన్ లాంచ్ చేస్తామని ప్రకటించింది. చెప్పినట్లుగానే, నేడు Nokia G42 5G డివైజ్ ని పరిచయం చేసింది. బడ్జెట్ సెగ్మెంట్ కొనుగోలుదారులను ఉద్దేశించి ఈ ఫోన్ ని తీసుకొచ్చినట్లుగా అర్థమవుతోంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ లో Nokia G42 5G మైక్రోసైట్ దర్శనమిస్తోంది. సరే, ఓసారి Nokia G42 5G డివైజ్ స్పెసిఫికేషన్స్, తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
You guessed it. The biggest drop of the season is Nokia G42 5G. Out soon. We’ll give you a few days to know all about it before you move fast and get your hands on it.
Click here to get notified: https://t.co/5odW3C5OHB#MoveFast #StayTuned #NokiaG42_5G #Nokiaphones… pic.twitter.com/FC47OVCrUF
— Nokia Mobile India (@NokiamobileIN) September 6, 2023
అమెజాన్ పై లిస్టైన Nokia G42 5G
- మైక్రోసైట్ ద్వారా లాంచ్ తేదీ ఏమీ పేర్కొనబడలేదు. అయితే, సెప్టెంబర్ 11 న Nokia G42 5G ధర వెల్లడవుతుందని ఉంది.
- లిస్టింగ్ ద్వారా Nokia G42 5G స్పెసిఫికేషన్స్ ని కూడా కంపెనీ రివీల్ చేసింది.
- పవర్ఫుల్ ఫీచర్స్ తో అందుబాటు ధరలో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది.
సెప్టెంబర్ 11 న ఈ ఫోన్ ధర రివీల్ కానుంది. - Nokia G42 5G కలర్ ఆప్సన్స్ గురించి మాట్లాడితే ఈ ఫోన్ పర్పుల్, గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Nokia G42 5G స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Nokia G42 5G లో 6.56-ఇంచ్ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే, హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Nokia G42 5G లో స్నాప్ డ్రాగన్ 480 ప్లస్ చిప్సెట్ ఉంది. ఇది 2.2 గిగాహెర్ట్జ్ హై-క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంది.
- స్టోరేజీ: Nokia G42 5G లో 128జిబి స్టోరేజీ, 6జిబి ర్యామ్, 5జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. దీంతో యూజర్ కి మొత్తం 11జిబి ర్యామ్ లభిస్తుంది.
- కెమెరా: Nokia G42 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్, 2ఎంపి మైక్రో సెన్సర్స్ ఉన్నాయి.
- బ్యాటరీ: Nokia G42 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 20 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Nokia G42 5G డివైజ్ ఆండ్రాయిడ్ ఓఎస్ పై పని చేస్తుంది. 3 ఏళ్ళ సెక్యూరిటీ అప్డేట్స్ ఆఫర్ చేస్తోంది.
- ఇతర ఫీచర్లు: Nokia G42 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్, ఓజో ప్లే బ్యాక్ లౌడ్ స్పీకర్ ఉన్నాయి.











