
స్మార్ట్‌ఫోన్ మేకర్ Nothing త్వరలో ఒక చవకైన స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. Nothing Phone (2a) అనే పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుందని సమాచారం. అయితే, దీనికి సంబంధించి ఇంకా అధికార ప్రకటన బయటకు రాలేదు. త్వరలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 2024 ఫిబ్రవరిలో జరిగే MWC (మొబైల్ వరల్డ్ కాంగ్రెస్) లో ఈ ఫోన్‌ని ప్రదర్శిస్తారని భావిస్తున్నారు. తాజాగా, Nothing Phone (2a) కి సంబంధించి ఓ లీక్ నెట్టింట్లో ప్రత్యక్షమైంది. ఈ లీక్ ద్వారా Nothing Phone (2a) యొక్క లాంచ్ తేదీ, కెమెరా స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
Nothing Phone (2a) కెమెరా స్పెసిఫికేషన్స్ (లీక్)

- Nothing Phone (2a) కెమెరా స్పెసిఫికేషన్స్ ని Smartprix అనే వెబ్‌సైట్ తన కథనం ద్వారా రివీల్ చేసింది.
- Nothing Phone (2a) లో 50ఎంపి శాంసంగ్ ఐసోసెల్ ఎస్5కేజీఎన్9 ప్రైమరీ కెమెరా ఉంటుందని స్మార్ట్‌ప్రిక్స్ వెల్లడించింది.
- Nothing Phone (2a) లో శాంసంగ్ యొక్క 50ఎంపి ఐసోసెల్ జెన్ఎన్1 అల్ట్రావైడ్ లెన్స్ ఉంటుంది.
- Nothing Phone (2a) లో 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా ఉంటుందని సమాచారం.
- తక్కువ ధరలో ఫోన్ ని తీసుకొస్తున్నప్పటికీ కంపెనీ కెమెరా విభాగంపై మంచిగానే ఫోకస్ పెట్టినట్లు అర్థమవుతోంది.
Nothing Phone (2a) లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్ (అంచనా)
- Nothing Phone (2a) స్మార్ట్‌ఫోన్ 2024 ఫిబ్రవరి 27 న బార్సిలోనాలో జరిగే MWC లో ‘Nothing to See’ ఈవెంట్ ద్వారా అఫీషియల్ గా పరిచయం కానుందని అంచనా వేస్తున్నారు.
- Nothing Phone (2a) డివైజ్ నలుపు మరియు తెలుపు రంగుల్లో మాత్రమే లభ్యం కానుంది.
- స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడితే, Nothing Phone (2a) లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది.
- త్వరలోనే Nothing Phone (2a) కి సంబంధించి మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి.











