Vivo X100 సిరీస్ ఇండియా లాంచ్ తేదీ ఖరారు; పూర్తి వివరాలు తెలుసుకోండి!

Highlights

  • జనవరి 4 న భారత్‌లో లాంచ్ కానున్న Vivo X100 సిరీస్
  • లైనప్‌లో వస్తోన్న Vivo X100, Vivo X100 Pro
  • 1.5కే డిస్ప్లేతో రానున్న Vivo X100 సిరీస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారతీయ మార్కెట్ లో Vivo X100 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ సిరీస్ చైనాలో లాంచ్ అయ్యింది. తాజాగా భారత మార్కెట్ లాంచ్ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. Vivo X100 సిరీస్ లో Vivo X100, Vivo X100 Pro ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. సరే, ఓసారి Vivo X100 Pro డివైజెస్ లాంచ్ తేదీ మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Vivo X100 సిరీస్ ఇండియా లాంచ్ తేదీ

  • Vivo X100 సిరీస్ భారత్ లో 2024 జనవరి 4 వ తేదీన లాంచ్ అవుతుందని వివో ఇండియా తాజాగా తన X ఖాతా ద్వారా తెలియజేసింది.
  • వివో ఇండియా షేర్ చేసిన టీజర్ వీడియో ద్వారా డివైజెస్ జీస్ టీ* ఆప్టిక్స్ తో రానున్నట్లు తెలుస్తోంది.
  • జనవరి 4వ తేదీనే Vivo X100 సిరీస్ తో పాటు Redmi Note 13 సిరీస్ కూడా భారత్ లో లాంచ్ కానుంది.
  • Vivo X100 సిరీస్ డివైజెస్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా సేల్ కి వచ్చే అవకాశం ఉంది.

Vivo X100, Vivo X100 Pro స్పెసిఫికేషన్స్ (చైనా)

  • డిస్ప్లే: Vivo X100 మరియు Vivo X100 Pro ఫోన్లలో 6.78-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2,160హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo X100, Vivo X100 Pro డివైజెస్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ వాడారు.
  • కెమెరా: Vivo X100 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 64ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో 3X ఆప్టికల్ జూమ్ లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. Vivo X100 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి 1-ఇంచ్ మెయిన్ కెమెరా, 50ఎంపి 4.3X పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. రెండు ఫోన్లలో 100X డిజిటల్ జూమ్ ఫీచర్ ఉంది. ఇక ప్రో-మోడల్ లో 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంది.
  • బ్యాటరీ: Vivo X100 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Vivo X100 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్‌ని కలిగి ఉంది.
  • ఓఎస్: Vivo X100, Vivo X100 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo X100, Vivo X100 Pro ఫోన్లలో 5జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: Vivo X100, Vivo X100 Pro స్మార్ట్‌ఫోన్లు బ్లాక్, ఆరెంజ్, బ్లూ మరియు వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి.
Previous article256GB స్టోరేజీతో రానున్న itel A70; ధర రూ.8,000 లోపే!
Next articleలీకైన Nothing Phone (2a) లాంచ్ తేదీ, కెమెరా స్పెసిఫికేషన్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.