Nothing: భారత్‌లో Phone (2a) కొత్త ఎడిషన్ లాంచ్ వివరాలు

Highlights

  • డైమెన్సిటీ 7200 చిప్సెట్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • ఫ్లిప్‌కార్ట్ పై కనిపిస్తోన్న ల్యాండింగ్ పేజీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nothing కొన్ని రోజుల క్రితం Phone (2a) ని లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ ఫోన్ యొక్క కొత్త ఎడిషన్ లాంచ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ పై ఈ కొత్త ఎడిషన్ యొక్క ల్యాండింగ్ పేజీ కనిపిస్తోంది. దీంతో భారత్ లో Nothing Phone (2a) కొత్త ఎడిషన్ లాంచ్ వివరాలు ముందుగానే రివీల్ అయ్యాయి. ఓసారి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

Nothing Phone (2a) కొత్త ఎడిషన్ లాంచ్

ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా Nothing Phone (2a) కొత్త ఎడిషన్ లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది. ఏప్రిల్ 29న (అంటే నేడు) ఈ ఫోన్ లాంచ్ అవ్వబోతుంది. వర్చువల్ లాంచ్ ఈవెంట్ ద్వారా ఈ ఫోన్ లాంచ్ ఉంటుందని భావిస్తున్నారు. ఏప్రిల్ 29న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ ఈవెంట్ ప్రారంభమవుతుంది. టీజర్ ద్వారా రియర్ ప్యానెల్ రివీల్ అయ్యింది. ఈ ఫోన్ ప్రత్యేకించి భారత్ కోసం డిజైన్ చేసినట్లు సమాచారం.

Nothing Phone (2a) స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Nothing Phone (2a) లో 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ (1080*2412 పిక్సెల్స్), 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ సపోర్ట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Nothing Phone (2a) లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. అంటుటు ప్లాట్ఫామ్ పై ఈ మొబైల్ 7,41,999 పాయింట్లు స్కోర్ చేసింది.

ర్యామ్, స్టోరేజీ: Nothing Phone (2a) డివైజ్ 12జిబి ర్యామ్ సపోర్ట్, 8జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని కలిగి ఉంది.

కెమెరా: Nothing Phone (2a) లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Nothing Phone (2a) లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Nothing Phone (2a) డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత నథింగ్ ఓఎస్ 2.5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Previous articleSamsung: లీకైన Galaxy F55 5G ధర
Next articleInfinix: 32MP సెల్ఫీ కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన GT 20 Pro
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.