Infinix: 32MP సెల్ఫీ కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన GT 20 Pro

Highlights

  • Infinix GT 20 Pro గ్లోబల్‌గా లాంచ్
  • డైమెన్సిటీ 8200 ప్రాసెసర్
  • 108ఎంపి మెయిన్ కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix జీటీ సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేసింది. Infinix GT 20 Pro పేరుతో ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్ లోకి వచ్చింది. మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్, 32ఎంపి సెల్ఫీ కెమెరా, 108ఎంపి మెయిన్ కెమెరా, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి Infinix GT 20 Pro యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Infinix GT 20 Pro ధర, కలర్ ఆప్షన్స్

Infinix GT 20 Pro డివైజ్ రెండు వేరియంట్స్ లో లభిస్తుంది. అవి: 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ. ఈ ఫోన్ ప్రారంభ ధర వివరాలు మరియు కలర్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Infinix GT 20 Pro స్మార్ట్‌ఫోన్ యొక్క ప్రారంభ ధరను సౌదీ అరేబియాలో SAR 1299 (సుమారు రూ.28,900) గా నిర్ణయించారు.

గ్లోబల్ మార్కెట్స్ లో ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో డివైజ్ మెకా సిల్వర్, మెకా బ్లూ మరియు మెకా ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Infinix GT 20 Pro ఫోన్ త్వరలో ఇవే స్పెసిఫికేషన్స్ తో భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఇండియా లాంచ్ కి సంబంధించిన వివరాలు తెలియదు. త్వరలోనే ఇన్ఫినిక్స్ నుంచి అధికార ప్రకటన రావొచ్చు.

Infinix GT 20 Pro స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Infinix GT 20 Pro లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2340 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 1300 నిట్స్ బ్రైట్నెస్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

ప్రాసెసర్: Infinix GT 20 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.1GHz.

ర్యామ్, స్టోరేజీ: Infinix GT 20 Pro డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 12జిబి వర్చువల్ ర్యామ్ ని కూడా ఈ ఫోన్ లో అందించారు. దీంతో యూజర్‌కి గరిష్టంగా 24జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Infinix GT 20 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్, 2ఎంపి థర్డ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Infinix GT 20 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. పీడీ 3.0 మరియు హైపర్ చార్జ్ మోడ్ అనేవి ఈ ఫోన్ లో ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Infinix GT 20 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై 6, ఐఆర్ బ్లాస్టర్, ఐపీ54 రేటింగ్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఉన్నాయి.