
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ Nothing త్వరలో Phone 2a ని లాంచ్ చేయనుంది. మార్చి 5న Nothing Phone 2a భారత్ లో లాంచ్ అవుతోంది. దీంతో నథింగ్ ఫ్యాన్స్ ఈ డివైజ్ లాంచ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈలోపు Nothing Phone 2a యొక్క కొత్త రెండర్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. వీటిని అఫీషియల్ రెండర్స్ గా భావిస్తున్నారు. సరే, ఓసారి లీకైన ఫోటోలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Nothing Phone 2a రెండర్స్ (లీక్)
- Nothing Phone 2a స్మార్ట్ఫోన్ రెండర్స్ నథింగ్ కమ్యూనిటీ మెంబర్ Greg2024 రివీల్ చేశారు.
- లీకైన ఇమేజ్ ని గమనిస్తే, Nothing Phone 2a డార్క్ గ్రే మరియు వైట్ కలర్ లో కనిపిస్తోంది.
- Nothing Phone 2a డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో ఎల్ఈడీ ఫ్లాష్ మరియు హారిజంటల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి.
- Nothing Phone 2a లో బ్యాక్ ప్యానెల్ పై ఎల్ఈడీ స్ట్రిప్స్ కనిపిస్తున్నాయి. వీటితో బ్యాక్ ప్యానెల్ లుక్ వేరే లెవెల్ లో ఉంది. అలాగే రెడ్ కలర్ లో ఒక స్క్వేర్ స్పాట్ ఉంది.
- ఇక ఫోన్ ముందు వైపు డిజైన్ గురించి మాట్లాడితే, ఫ్లాట్ ప్యానెల్ ఉంది. సన్నని బెజెల్స్, పంచ్ హోల్ డిజైన్ ఉన్నాయి.
- వాల్యూమ్ మరియు పవర్ బటన్స్ ఫోన్ కి ఎడమవైపున ఉన్నాయి. ఫోన్ బ్యాక్ ప్యానెల్ కి బాటమ్ లో ఎడమవైపున నథింగ్ బ్రాండింగ్ ఉంది.
Nothing Phone 2a స్పెసిఫికేషన్స్ (ఖరారు)
- ప్రాసెసర్: Nothing Phone 2a డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో చిప్సెట్ తో వస్తోంది. ఈ చిప్సెట్ గరిష్ట క్లాక్ స్పీడ్ 2.8 గిగాహెర్ట్జ్.
- ర్యామ్: Nothing Phone 2a డివైజ్ 12జిబి ర్యామ్ తో వస్తోంది. అలాగే 8జిబి ర్యామ్ బూస్టర్ టెక్నాలజీతో యూజర్ కి గరిష్టంగా 20జిబి వరకు ర్యామ్ లభిస్తుంది.
Phone (2a) is home to a powerhouse: the custom-built MediaTek Dimensity 7200 Pro.
Exclusively co-engineered with Nothing to deliver a seamless performance with remarkable power efficiency. pic.twitter.com/JwSVtgGCRP
— Nothing (@nothing) February 20, 2024
Nothing Phone 2a స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Nothing Phone 2a లో 6.7-ఇంచ్ అమోలెడ్ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- కెమెరా: Nothing Phone 2a లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఐసోసెల్ ఎస్5కేజీ9 ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ ఓఐఎస్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Nothing Phone 2a డివైజ్ 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియదు.
- ఓఎస్: Nothing Phone 2a డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత నథింగ్ ఓఎస్ 2.5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.











