Realme Narzo 70 Pro 5G ఇండియా లాంచ్ ఖరారు

Highlights

  • మార్చిలో భారత్‌లో Realme Narzo 70 Pro 5G లాంచ్
  • 50ఎంపి సోని ఐఎంఎక్స్890 తో వస్తోన్న డివైజ్
  • అమెజాన్ పై కనిపిస్తోన్న డివైజ్ మైక్రోసైట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో Narzo సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Realme Narzo 70 Pro 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా Realme Narzo 70 Pro 5G ఇండియా లాంచ్ ఖరారైంది. మార్చి నెలలో Realme Narzo 70 Pro 5G భారత్ లో లాంచ్ అవుతోందని ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ ద్వారా ఖరారైంది. ఈ ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ తో వస్తున్నట్లు సమాచారం. సరే, ఓసారి డివైజ్ లాంచ్ మరియు ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.

Realme Narzo 70 Pro 5G ఇండియా లాంచ్ ఖరారు

  • Realme Narzo 70 Pro 5G స్మార్ట్‌ఫోన్ కంపెనీ అధికార వెబ్‌సైట్ మరియు అమెజాన్ పై లిస్ట్ అయ్యింది.
  • Realme Narzo 70 Pro 5G డివైజ్ లో బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ కెమెరా మాడ్యూల్ మరియు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి.
  • Realme Narzo 70 Pro 5G డివైజ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ తో వస్తున్నట్లు ఇమేజెస్ ద్వారా తెలుస్తోంది.
  • Realme Narzo 70 Pro 5G లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా ఉంటుందని ఖరారైంది.
  • రియల్మీ వెబ్‌సైట్ ద్వారా రివీలైన సమాచారాన్ని బట్టి, రియల్మీ బ్రాండ్ ఈ ఫోన్‌కి సాఫ్ట్‌వేర్, ఫోటోగ్రఫీ మరియు ఉత్తమమైన స్పెసిఫికేషన్స్ ని అందించనున్నట్లు తెలుస్తోంది.
  • గత మోడల్ Realme Narzo 60 Pro 5G యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఓసారి తెలుసుకుందాం.

Realme Narzo 60 Pro 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Realme Narzo 60 Pro 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme Narzo 60 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, ఏఆర్ఎమ్ మాలి-జీ68 జీపీయూ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Realme Narzo 60 Pro 5G డివైజ్ 12జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ వరకు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 12జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ ఉంది. దీంతో యూజర్ కి అదనపు ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • కెమెరా: Realme Narzo 60 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 100ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Realme Narzo 60 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Realme Narzo 60 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.
Previous articleNothing: లాంచ్‌కి ముందు లీకైన Nothing Phone 2a కొత్త రెండర్స్
Next articleSmartphones: 2024 మార్చిలో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.