Vivo T3 Ultra ఇండియా లాంచ్ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి

Highlights

  • వివో టీ3 అల్ట్రా లాంచ్ కన్ఫర్మ్
  • వివో అధికార ప్రకటన
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo టీ3 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Vivo T3 Ultra పేరుతో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లోకి అడుగుపెట్టబోతోంది. తాజాగా ఇండియా లాంచ్‌ని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ప్రస్తుతం కంపెనీ వెబ్‌సైట్ తో పాటు, ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ పై Vivo T3 Ultra యొక్క మైక్రోసైట్ దర్శనమిస్తోంది. దీంతో ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం.

Vivo T3 Ultra స్పెసిఫికేషన్స్ (ఖరారు)

Vivo T3 Ultra స్మార్ట్‌ఫోన్ యొక్క మైక్రోసైట్ ఫ్లిప్‌కార్ట్ మరియు కంపెనీ వెబ్‌సైట్ లో కనిపించింది. దీంతో స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. అవెలా ఉన్నాయో తెలుసుకుందాం.

డిస్ప్లే: Vivo T3 Ultra లో 6.78-ఇంచ్ 3డీ కర్వ్డ్ 1.5కే అమోలెడ్ స్క్రీన్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పీ3 సినిమా గ్రేడ్ కలర్ గ్యామట్, 8000000:1 కాంట్రాస్ట్ రేషియో, హెచ్డీఆర్ 10+ ఉంటాయి.

ప్రాసెసర్: Vivo T3 Ultra లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. అంటుటు ప్లాట్ఫామ్ పై స్కోర్ 16,09,257 గా ఉంది.

ర్యామ్, స్టోరేజీ: Vivo T3 Ultra స్మార్ట్‌ఫోన్ 12జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీతో రానుంది. ఈ ఫోన్ లో 12జిబి వర్చువల్ ర్యామ్ కూడా ఉంటుంది. దీంతో యూజర్‌కి గరిష్టంగా 24జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Vivo T3 Ultra లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్921 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి గ్రూప్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇది ఆటోఫోకస్, ఏఐ ఫేసియల్ కలరింగ్ టెక్నాలజీతో వస్తోంది.

బ్యాటరీ, చార్జింగ్: Vivo T3 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Vivo T3 Ultra డివైజ్ ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది.

ఇప్పటి వరకు కన్ఫర్మ్ అయిన స్పెసిఫికేషన్స్ వివరాలను మీకు అందించాం. ఇకపోతే, ఈ ఫోన్ ఈ నెలలోనే లాంచ్ అవుతుందని అంచనా వేయడమైంది. త్వరలోనే వివో నుంచి లాంచ్ తేదీకి సంబంధించిన ప్రకటన రావొచ్చు.