ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ Nothing త్వరలో Nothing Phone (2a) డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఇంకా ఈ డివైజ్ యొక్క లాంచ్ తేదీ వెల్లడి కాలేదు. త్వరలోనే కంపెనీ నుంచి అధికార ప్రకటన రానుంది. తాజాగా Nothing Phone (2a) టీయూవీ సర్టిఫికేషన్ వెబ్సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ యొక్క ఛార్జింగ్ స్పీడ్ వివరాలు రివీల్ అయ్యాయి. ఇకపోతే, Nothing Phone (2a) ఫోన్ ఇప్పటికే బీఐఎస్ మరియు టీడీఆర్ఏ సర్టిఫికేషన్స్ పొందింది. సరే, ఓసారి Nothing Phone (2a) యొక్క టీయూవీ సర్టిఫికేషన్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.
Nothing Phone (2a) టీయూవీ సర్టిఫికేషన్
- Nothing Phone (2a) టీయూవీ సర్టిఫికేషన్ వెబ్సైట్ పై లిస్ట్ అయ్యినట్లు Gizmochina తన కథనం ద్వారా వెల్లడించింది.
- Nothing Phone (2a) స్మార్ట్ఫోన్ టీయూవీ డేటాబేస్ పై A142 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
- Nothing Phone (2a) డివైజ్ టీయూవీ సర్టిఫికేషన్ లిస్టింగ్ పై 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో కనిపిస్తోంది.
- Nothing Phone (2a) యొక్క ఛార్జింగ్ స్పీడ్ వివరాలు మినహా, మరే ఇతర వివరాలు తెలియలేదు.
- Nothing Phone (2a) డివైజ్ ఇప్పటికే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వెబ్సైట్స్ పై లిస్ట్ అయ్యింది.
- Nothing Phone (2a) లాంచ్ తేదీని త్వరలోనే కంపెనీ అధికారికంగా ప్రకటించనుంది.
Nothing Phone (2a) స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Nothing Phone (2a) లో 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండే అవకాశం ఉంది.
- ప్రాసెసర్: Nothing Phone (2a) లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ ఉంటుందని రూమర్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.
- ర్యామ్, స్టోరేజీ: Nothing Phone (2a) స్మార్ట్ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ తో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.
- కెమెరా: Nothing Phone (2a) లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉంటాయని అంచనా వేస్తున్నారు. కెమెరా ఐల్యాండ్ చుట్టూ గ్లైఫ్ ఎల్ఈడీ లైట్ స్ట్రిప్స్ ఉంటాయి.
- బ్యాటరీ: Nothing Phone (2a) లో 4,290 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రానుందని టీయూవీ సర్టిఫికేషన్ ద్వారా తెలుస్తోంది.
- ఓఎస్: Nothing Phone (2a) స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత నథింగ్ ఓఎస్ 2.5 కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.
- కలర్ ఆప్షన్స్: Nothing Phone (2a) డివైజ్ తెలుపు మరియు నలుపు రంగుల్లో లభించనుందని అంచనా వేస్తున్నారు.
Nothing Phone (2a) ధర
- Nothing Phone (2a) స్మార్ట్ఫోన్ బేస్ మోడల్ ధర 400 యూరోల లోపు ఉంటుందని తెలుస్తోంది.
