Nothing Phone (3) కోసం వేచి చూస్తున్న వారికి షాకింగ్ న్యూస్

Highlights

  • ఇప్పట్లో లాంచ్ లేనట్లే
  • 2025లో లాంచ్ అయ్యే అవకాశం
  • కన్ఫర్మ్ చేసిన కార్ల్ పే

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nothing మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే జనాల్లో మంచి ఆదరణ సంపాదించింది. ట్రాన్స్‌పరెంట్ బ్యాక్ ప్యానెల్, ఎల్ఈడీ లైట్స్.. ఇలా ఆకర్షణీయమైన డిజైన్లలో నథింగ్ తన ఫోన్లను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. వీటిని యూజర్లు తెగ కొన్నారు. ఇప్పుడు నథింగ్ నుంచి రాబోయే Nothing Phone (3) కోసం ఎదురు చూస్తున్నారు. అయితే, నథింగ్ సీఈవో కార్ల్ పే ఈ ఫోన్ కి సంబంధించి షాకింగ్ న్యూస్ చెప్పారు. అదేంటో తెలుసుకుందాం పదండి.

Nothing Phone (3) లాంచ్ ఇప్పట్లో లేనట్లే

Nothing Phone (3) స్మార్ట్‌ఫోన్ లాంచ్ ఈ ఏడాది ఉండబోదని నథింగ్ సీఈవో/కో-ఫౌండర్ కార్ల్ పే తెలిపారు. ఈ ఫోన్ 2025 లో లాంచ్ అవుతుందని ఆయన అన్నారు. రాబోవు ఫోన్ ఏఐ టెక్నాలజీతో వస్తోందని, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ విషయంలో అడ్వాన్స్డ్ గా ఉంటుందని ఆయన చెప్పారు.

Nothing Phone (3) ప్రాసెసర్ వివరాలు

Nothing Phone (3) డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ తో వస్తున్నట్లు లీక్స్ ద్వారా తెలుస్తోంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3 గిగాహెర్ట్జ్.

Nothing Phone (3) డివైజ్ 2025 లో లాంచ్ కానుందని కంపెనీ తాజాగా స్పష్టం చేసింది. కాబట్టి, ఈ ఫోన్ లో అడ్వాన్స్డ్ చిప్ ఉంటుందని అంచనా వేయవచ్చు.

ఇక Nothing Phone (3) ధర విషయానికి వస్తే, రూ.45,000 లోపు ఉంటుందని చెప్పవచ్చు. రానున్న రోజుల్లో ఈ ఫోన్‌కి సంబంధించి మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.

Nothing Phone (2) స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Nothing Phone (2) లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ ఎల్టీపీవో డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, 10 బిట్ కలర్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Nothing Phone (2) లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 720 జీపీయూ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Nothing Phone (2) డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Nothing Phone (2) లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 50ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Nothing Phone (2) లో పవర్ బ్యాకప్ కోసం 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Nothing Phone (2) డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Nothing Phone (2) లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.