భారత్ లో మళ్ళీ లాంచ్ అయిన Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్

హైలైట్స్:

  • రూ.99,999 ధరతో భారత్ లో రీ-లాంచ్ అయిన ఓలా ఎస్1
  • ఓలా యొక్క ఎలక్ట్రిక్ పోర్ట్ ఫోలియో లోని S1 Pro తో చేరిన ఓలా ఎస్1 స్కూటర్
  • 2024 లో లాంచ్ కానున్న ఓలా ఎలక్ట్రిక్ కారు

భారత్ యొక్క 76వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా, మిషన్ ఎలక్ట్రిక్ 2022 ఈవెంట్ లో ఓలా ఎలక్ట్రిక్ నేడు ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసింది. ఓ కొత్త ప్రోడక్ట్ లాంచ్ ఉంటుందని గతంలో ఓలా ఎలక్ట్రిక్ టీజ్ చేసింది. అది ఓలా ఎలక్ట్రిక్ కారు లేదా తక్కువ ధరలో స్కూటర్ అని అంతా అనుకున్నారు. ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు, ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఎలక్ట్రిక్ కారుని ఓలా టీజ్ చేసింది. అలాగే ఎలక్ట్రిక్ కారు 2024 లో లాంచ్ అవుతుందని ఓలా ప్రకటించింది. ఇంకా, ఖాకీ రంగు ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా అనౌన్స్ అయ్యింది. ఇది లిమిటెడ్ ఎడిషన్ కాగా, కేవలం 1947 యూనిట్లు మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉంటాయి.

ఓలా ఎస్1 ప్రో స్కూటర్ కి, ఓలా ఎస్1 బడ్జెట్ వర్షన్ గా లాంచ్ అయ్యింది. ఈ స్కూటర్ కూడా ఒకే ప్లాట్ఫామ్ పై నిర్మితమై, సేమ్ డిజైన్ ని కలిగి ఉంది.

భారత్ లో Ola S1 ధర, ఆఫర్లు, లభ్యత, వ్యారంటీ

రూ.99,999 పరిచయ ధరతో ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ భారత్ లో లాంచ్ అయ్యింది. ఓలా ఎస్1 ప్రో (రూ.1.39 లక్షలు) ధరతో పోల్చితే తక్కువ వెలతో ఎస్1 స్కూటర్ లాంచ్ కావడం విశేషం. ఆగస్టు 15 నుంచి ఆగస్టు 31 మధ్య ఓలా ఎలక్ట్రిక్ యాప్ లేదా కంపెనీ యొక్క అధికార వెబ్ సైట్ ద్వారా రూ.499 చెల్లించి ఈ బండిని బుక్ చేసుకోవచ్చు. రిజర్వ్ చేసుకున్న వారికి సెప్టెంబర్ 1 నుంచి ఎర్లీ యాక్సెస్ పర్చేస్ విండో ఓపెన్ అవుతుంది. మిగతా వారికి సెప్టెంబర్ 2 నుంచి అమ్మాకానికి అందుబాటులోకి వస్తుంది. ఇక సెప్టెంబర్ 7 నుంచి డెలివరీలు మొదలవుతాయి.

ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ని కొనాలని అనుకునే వారికి, ఓలా వద్ద ఫైనాన్సింగ్ సౌకర్యం కలదు. రూ.2,999 నుంచి ఈఎంఐ మొదలవుతుంది. అలాగే ఓలా పార్ట్నర్ బ్యాంక్స్ నుంచి లోన్ ప్రాసెసింగ్ ఫీ నుంచి మినహాయింపు లభిస్తుంది. 5 సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ వ్యారంటీని కూడా ఓలా అందిస్తోంది. వ్యారంటీ పరిధిలోకి బ్యాటరీ, మోటర్ ఇతర కంపోనెంట్స్ వస్తాయి. ప్రస్తుతం ఉన్న ఓలా ఎస్1 ప్రో వినియోగదారులు కూడా ఈ వ్యారంటీని కొనుగోలు చేయవచ్చు.

Ola S1 కలర్స్, డిజైన్, స్పెసిఫికేషన్స్, రేంజ్

ఓలా ఎస్1 డిజైన్ ని గమనిస్తే, ఓలా ఎస్1 ప్రో మాదిరే ఉంది. అలాగే రెండు బండ్లు కూడా ఒకే ప్లాట్ఫామ్ పై నిర్మితమయ్యాయి. ఇక ఓలా ఎస్1 బండి రెడ్, జెట్ బ్లాక్, పార్సిలిన్ వైట్, నియో మింట్, లిక్విడ్ సిల్వర్ వంటి రంగుల్లో లభ్యమవుతుంది. ఇందులో కూడా మూవ్ఓఎస్ ఉంది. మూవ్ ఓఎస్ 3.0 తో పాటు, ఫ్యూచర్ అప్డేట్స్ అన్నీ కూడా లభిస్తాయి. కాగా, మూవ్ఓఎస్ 3.0 దీపావళికి లాంచ్ అవుతోంది.

ఓలా ఎస్1 3 కిలో వాట్ బ్యాటరీని కలిగి ఉంది. ఓలా ఎస్1 ప్రో లో 3.97 కిలోవాట్ బ్యాటరీ ఉంది. ఓలా ఎస్1 యొక్క ఏఆర్ఏఐ సర్టిఫైడ్ రేంజ్ 131 కిలోమీటర్లు. ఎకో మోడ్ లో 128 కిలోమీటర్లు, నార్మల్ మోడ్ లో 101 కిలోమీటర్లు, స్పోర్ట్స్ మోడ్ లో 90 కిలోమీటర్లు గా ఈ బండి రేంజెస్ ఉన్నాయి. ఇక టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈ బండి అత్యధికంగా గంటకు 90 కిలోమీటర్లు వేగాన్ని అందుకోగలదు. సాఫ్ట్‌వేర్ ఫీచర్లలో మ్యూజిక్, నేవిగేషన్, కంపానియన్ యాప్, రివర్స్ మోడ్, దాదాపుగా ఓలా ఎస్1 ప్రో బండిలో ఉన్న అన్ని ఫీచర్లు ఇందులో కూడా ఉన్నాయి.

2021 ఆగస్టు 15 న తొలుత ఓలా ఎస్1 లాంచ్ అయ్యింది. కానీ, కొన్ని వివాదాల కారణంగా ఈ బండి ఈ ఏడాది జనవరిలో నిలిపివేయబడింది. అలాగే ఖరీదైన ఓలా ఎస్1 ప్రో బండి పై కంపెనీ ఎక్కువగా ఫోకస్ చేయడం వల్లన ఈ విధంగా జరిగింది.

ఇక భారత్ లో గత కొన్ని నెలలుగా టాప్ సెల్లర్ గా ఉంటూ వస్తోన్న ఓలా ఎలక్ట్రిక్, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్ లో 5 శాతం వాటాను కలిగి ఉంది. అయితే, బ్రేకింగ్ సస్పెన్షన్, రివర్స్ మోడ్ దానికదే అప్లై అవుతుండటం, ఫైర్ యాక్సిడెంట్స్ వంటి ఫిర్యాదులు కస్టమర్ల నుంచి వస్తుండటంతో ఓలా కంపెనీ పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. మరి ఈసారి వీటిని అధిగమించి మార్కెట్లో ఓలా దూసుకెళ్తుందేమో చూడాలి.

Previous articleలాంచ్ కి ముందు లీకైన Realme 9i 5G రెండర్స్
Next articleకొత్త ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్ చేసిన Jio
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.