హైలైట్స్
- చీపెస్ట్ ఈ-స్కూటర్ Ola S1 Air ని లాంచ్ చేసిన Ola Electric
- 2.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్, 101 కిలోమీటర్ల రేంజ్ తో వచ్చిన Ola S1 Air
- మిస్ అయిన బాడీ కలర్ ప్యానెల్స్, డిస్క్ బ్రేక్స్, అల్యూమినియమ్ గ్య్రాబ్ రెయిల్స్
చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ Ola S1 Air ని ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ భారత్ లో లాంచ్ చేసింది. సరికొత్త Ola S1 Air, Ola S1 కంటే చీపెస్ట్ స్కూటర్. దానికి తగినట్లే పలు మార్పులు కూడా ఇందులో చోటు చేసుకున్నాయి. కాస్ట్ కట్టింగ్ అనేది అనువణువుగా కనిపించింది. తక్కువ ధరకు స్కూటర్ ని అందించాలనే ఉద్దేశ్యంతో బెంగళూరు స్టార్టప్ అయిన ఓలా ఎలక్ట్రిక్ పలు ఫీచర్లను కట్ చేసింది. మరి Ola S1 Air విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
Ola S1 Air ధర, లభ్యత
Ola S1 Air ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా ఎలక్ట్రిక్ నుంచి వచ్చిన చీపెస్ట్ ఆఫరింగ్. ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధరని రూ.79,999 గా నిర్ణయించారు. అయితే ఇది పరిమితకాల ఆఫర్ అని గుర్తించాలి. అతి త్వరలో దీని ధర రూ.84,999 కి చేరుకుంటుంది. ఇప్పుడు ఈ స్కూటర్ ని బుక్ చేసుకునే వారికి ఓలా 2023 ప్రథమార్థం నుంచి డెలివరీ చేయడం మొదలు పెడుతుంది.
Ola S1 Air స్పెసిఫికేషన్స్
Ola S1 Air డిజైన్ చూస్తే గత మోడల్స్ మాదిరే కనిపిస్తోంది. కానీ, పలు మార్పులను గమనించవచ్చు. ఫ్లోర్ బోర్డ్ ఫ్లాట్ గా మారిపోయింది. ఇంకా సీటు క్రింద బూట్ స్పేస్ ని 2 లీటర్లు తగ్గించారు. దీంతో మొత్తం బూట్ స్పేస్ 34 లీటర్లకు చేరుకుంది. స్కూటర్ క్రింది భాగాలు పెయింట్ చేయబడని ప్లాస్టిక్ ఫినిషింగ్ తో వస్తున్నాయి. సింగిల్ పీస్ గ్య్రాబ్ రెయిల్ అందించారు. సింపుల్ గా కనిపించే విధంగా స్కూటర్ ని డిజైన్ చేశారు.
Ola S1 Air లో 2.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అమర్చారు. దీన్ని పూర్తిగా చార్జ్ చేయడానికి 4 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది. ఈ మోటర్ 4.5 కిలోవాట్ పీక్ పవర్ ని జనరేట్ చేస్తుంది. ఇకపోతే ఈ స్కూటర్ 4.3 సెకన్లలో 0 నుంచి 43 కేఎంపీహెచ్ స్పీడ్ ని అందుకుంటుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ 85కేఎంపీహెచ్. Ola S1 Air సింగిల్ చార్జ్ పై 101 కిలోమీటర్ల దూరం పరిగెడుతుంది.
Ola S1 Air లో ఫ్యాన్సీ రైడ్ మోడ్స్ ని తీసివేశారు. కేవలం ఇకో, నార్మల్ మరియు స్పోర్ట్స్ మోడ్స్ ని అందించారు. అయితే Ola S1 Air లో 7-ఇంచ్ టీఎఫ్‌టీ టచ్ స్క్రీన్ ని అందించడం విశేషం. ఈ టచ్ స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ Move OS 3.0 సాఫ్ట్ వేర్ పై పని చేస్తుంది. Ola S1 Air లో రివర్స్ మోడ్, హిల్-హోల్డ్ ఫంక్షనాలిటీ, యూజర్ ప్రొఫైల్స్ ని అందించారు.
Ola S1 Air చౌకైన స్టీల్ వీల్స్ తో వస్తోంది. అయితే డిజైన్ అట్రాక్టివ్ గానే ఉంది. Ola S1 Air బేసిక్ ట్విన్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, డ్యూయల్ రియర్ షాక్ అబ్సార్బర్స్ ని కలిగి ఉంది. Ola S1 Air లో ముందు వెనుక డ్రమ్ బ్రేక్ సెటప్ ఉంది. Ola S1 Air యొక్క మొత్తం బరువు 99 కిలోలు. Ola S1, Ola S1 Pro తో పోల్చితే ఇది చాలా తేలికగా ఉండనుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












