OnePlus 11 5G ఇండియా లాంచ్ తేదీని ప్రకటించిన వన్‌ప్లస్

హైలైట్స్

  • న్యూఢిల్లీలో ఫిబ్రవరి 7 న జరగనున్న OnePlus 11 లాంచ్ ఈవెంట్
  • OnePlus 11 5G తో పాటు లాంచ్ కానున్న OnePlus Buds Pro 2
  • హాజెల్ బ్లడ్ కెమెరాలు, అలర్ట్ స్లైడర్ తో వస్తోన్న వన్‌ప్లస్ 11 5జీ
  • క్యూహెచ్డీ+ డిస్ప్లే, 32ఎంపి 2ఎక్స్ జూమ్ టెలీఫోటో లెన్స్, 8 జెన్ 2 చిప్ ప్రధాన ఆకర్షణలు

భారత్ లో OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 7 న లాంచ్ అవుతోంది. ఈ విషయాన్ని కంపెనీ వన్ ప్లస్ ఇండియా వెబ్ సైట్ లో తెలిపింది. వెబ్ సైట్ లో డెడికేటెడ్ పేజీని మనం గమనించవచ్చు. లాంచ్ ఈవెంట్ దేశ రాజధాని న్యూఢిల్లీలో జరగనుంది. వన్ ప్లస్ వెబ్ సైట్ లో OnePlus 11 5G యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ కూడా కన్ఫర్మ్ అయ్యాయి. హాజెల్ బ్లడ్ కెమెరాలు, అలర్ట్ స్లైడర్ ఫీచర్ ఈ ఫోన్ లో ఉండనున్నాయి. రానున్న రోజుల్లో OnePlus 11 5G కి సంబంధించిన మరిన్ని వివరాలు వెలువడనున్నాయి.

వన్‌ప్లస్ 11 5జి ఇండియా లాంచ్ తేదీ ప్రకటన

OnePlus 11 5G లాంచ్ ఈవెంట్ ని ఫిబ్రవరి 7 న న్యూఢిల్లీలో నిర్వహించబోతున్నట్లు వన్ ప్లస్ సంస్థ ప్రకటించింది. రాత్రి 7.30 గంటలకు ఈవెంట్ ప్రారంభమవుతుంది. ఈ ఈవెంట్ ని యూట్యూబ్ లో లైవ్ చూసే అవకాశం ఉంది.

వన్‌ప్లస్ 11 5జి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

OnePlus 11 5G కి సంబంధించి ఇప్పటివరకు డిజైన్, ప్రధాన స్పెసిఫికేషన్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వచ్చిన టీజర్ తో భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ రివీల్ అయ్యింది. ఈ తరహా లుక్ ని గత నెలలో ప్రముఖ టిప్‌స్టర్ ఆన్‌లీక్స్ లీక్ చేసింది. ఇక OnePlus 11 5G రియర్ కెమెరా మాడ్యూల్ లో మూడు కెమెరా సెన్సర్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. ఇప్పటికైతే ఫోన్ యొక్క డిస్ప్లే లుక్ కనిపించలేదు. అయితే పంచ్-హోల్ కటౌట్ లో ఫ్రంట్ కెమెరా ఉంటుందని మేం కచ్చితంగా చెప్పగలం. ఇంకా కర్వ్డ్ స్క్రీన్, స్లిమ్ బెజెల్స్ కూడా ఉండనున్నాయి.

OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ క్యూహెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ తో రానుంది.

OnePlus 11 5G కెమెరా విభాగం ఎలా ఉండనుందో చూద్దాం. ఈ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 చిప్సెట్, 48ఎంపి సోని ఐఎంఎక్స్581 అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి సోని ఐఎంఎక్స్709 2x జూమ్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి. OnePlus 11 5G లో 32ఎంపి సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉంది. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.