హైలైట్స్
- ప్రస్తుతం Realme GT Neo 5 పై పని చేస్తున్న రియల్మీ కంపెనీ
- లాంచ్ కి ముందు లీకైన Realme GT Neo 5 స్పెసిఫికేషన్స్
- 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కల్గిన ప్రపంచపు తొలి స్మార్ట్ ఫోన్ గా వస్తోన్న Realme GT Neo 5

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ త్వరలో Realme GT Neo 5 డివైజ్ ని చైనాలో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈలోపు ఫోన్ యొక్క రెండర్స్ ఇంటర్నెట్ లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఫోన్ ఎలా ఉండనుందోనన్న దానిపై ఓ క్లారిటీ వచ్చేసింది. మరోవైపు రియల్మీ కంపెనీ అప్పుడే Realme GT Neo 5 లాంచ్ ని టీజ్ చేస్తుండటం విశేషం.
నేడు Realme GT Neo 5 యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. బాగా తెలిసిన సోర్స్ నుంచి ఈ వివరాలు బయటకు వచ్చాయి. వాటిలో డిస్ప్లే, కెమెరా, చిప్సెట్ మరియు బ్యాటరీ స్పెసిఫికేషన్స్ ఇతర వివరాలు ఉన్నాయి. మరి అవేంటో తెలుసుకుందాం పదండి.
Realme GT Neo 5 స్పెసిఫికేషన్స్ (లీక్డ్)
ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా Realme GT Neo 5 స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ ప్రకారం, Realme GT Neo 5 6.7-ఇంచ్ 1.5కే ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. ఇకపోతే ఈ ఫోన్ లో శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ ని వినియోగించినట్లు సమాచారం. దీనికి తోడు 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్4.0 స్టోరేజీని అందిస్తున్నట్లు తెలుస్తోంది.
Realme GT Neo 5 ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది. పవర్ బ్యాకప్ కోసం Realme GT Neo 5 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ని కలిగి ఉంటుంది. అలాగే మరొక వేరియంట్ 4600 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుంది. ఇది 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
భద్రత కోసం ఈ డివైజ్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే, ఈ ఫోన్ ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వస్తోంది. Realme GT Neo 5 డివైజ్ ఆర్బీజీ లైట్స్ తో వస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు రియల్మీ ఈ తరహా లైటింగ్ ఫోన్ ని తీసుకురాలేదు.
ఇప్పడు Realme GT Neo 5 కెమెరా విభాగం ఎలా ఉండనుందో తెలుసుకుందాం. Realme GT Neo 5 లో 50 ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి లేదా 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుంది. త్వరలోనే ఈ డివైజ్ లాంచ్ తేదీ వెలువడనుంది. చైనాలో లాంచ్ అయ్యాక, ఈ ఫోన్ భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లోకి ఎంట్రీ కానుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











