భారత్‌లో లాంచైన OnePlus 11R Solar Red 8జిబి ర్యామ్ మోడల్

Highlights

  • OnePlus 11R Solar Red కొత్త ర్యామ్ మోడల్ లాంచ్
  • 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ
  • ప్రారంభ ధర రూ.35,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నేడు భారతీయ మార్కెట్ లో OnePlus 11R Solar Red ఎడిషన్‌ కొత్త ర్యామ్ వేరియంట్‌ని లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ ఫోన్ సోలార్ రెడ్ కలర్ మోడల్ 8జిబి ర్యామ్ తో లభించనుంది. ప్రస్తుతం OnePlus 11R భారత్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంది. OnePlus 11R Solar Red 8జిబి ర్యామ్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

OnePlus 11R Solar Red 8జిబి ర్యామ్ ధర

OnePlus 11R Solar Red ఎడిషన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.35,999 గా నిర్ణయించారు.

OnePlus 11R యొక్క సోనిక్ బ్లాక్ మరియు గెలాక్టిక్ సిల్వర్ కలర్ ఆప్షన్స్ ధర రూ.32,999 గా ఉంది.

OnePlus 11R 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.43,999 గా ఉంది. అన్ని మోడల్స్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉన్నాయి.

OnePlus 11R స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్ 6.74-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే తో వచ్చింది. 120 హెర్ట్జ్ సూపర్ ఫ్లూయిడ్ డిస్ప్లే, 1450 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1000 హెర్ట్జ్ టచ్ రెస్పాన్స్ రేట్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

చిప్సెట్: OnePlus 11R 5G లో స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ వాడారు.

బ్యాటరీ: OnePlus 11R 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. OnePlus 11R 5G డివైజ్ సోనిక్ బ్లాక్, గెలాక్టిక్ సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

మెమొరీ: OnePlus 11R 5G లో 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్4.0 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.

ఓఎస్: ఈ హ్యాండ్సెట్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: OnePlus 11R 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 మెయిన్ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఈ ఫోన్ లో ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

కనెక్టివిటీ: OnePlus 11R 5G లో 5జీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

చుట్టుకొలత, బరువు: OnePlus 11R 5G డివైజ్ 163.1 మిల్లీ మీటర్ల పొడవు, 74.1 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.53 మిల్లీ మీటర్ల మందం, 205 గ్రాముల బరువు ఉంటుంది.

ఇతర ఫీచర్లు: భద్రత కోసం ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. డాల్బి అట్మాస్, అలర్ట్ స్లైడర్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Previous articleVivo: బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్‌పై లిస్టైన Y28 4G
Next articleVivo V30e ఇండియా లాంచ్ ఖరారు
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.