
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus ఉత్పత్తులకు భారత్‌లో ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. తాజాగా వన్‌ప్లస్ లవర్స్‌కి శుభవార్త వచ్చేసింది. OnePlus 11R, OnePlus Nord CE 4 ఫోన్లపై ఆకట్టుకునే డీల్స్‌ని వన్‌ప్లస్ తీసుకొచ్చింది. మే 2 నుంచి ప్రారంభం కానున్న అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ లో ఈ ఫోన్లపై డిస్కౌంట్ లభించనుంది. ఓసారి ఆఫర్ వివరాలను తెలుసుకుందాం పదండి.
OnePlus 11R, Nord CE 4 ఆఫర్లు
OnePlus 11R డివైజ్ 2023 లో 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ రూ.39,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ప్రస్తుతం విక్రయ ధర రూ.35,999 గా ఉంది. బ్యాంక్ ఆఫర్ల తర్వాత ఈ ఫోన్ రూ.29,999 కే లభించనుంది. అంతేకాదు, 6 నెలల కాలపరిమితి మరియు నెలకు రూ.5,000 కనీస చెల్లింపుతో నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంది.
OnePlus Nord CE 4 డివైజ్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ లాంచ్ ధర రూ.24,999 గా ఉంది. సేల్ సమయంలో బ్యాంక్ ఆఫర్లతో కలుపుకుని, ఈ ఫోన్‌ని రూ.22,999 కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు, 6 నెలల కాలపరిమితి మరియు నెలకు రూ.3,833 కనీస చెల్లింపుతో నో-కాస్ట్ ఈఎంఐ ప్లాన్ అందుబాటులో ఉంది.
OnePlus 11R స్పెసిఫికేషన్స్
OnePlus 11R స్మార్ట్‌ఫోన్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 8జిబి/16జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి.
OnePlus Nord CE 4 స్పెసిఫికేషన్స్
OnePlus Nord CE 4 లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఐపీ54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 256జిబి వరకు స్టోరేజీ, 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, ఆక్సిజన్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ ఉన్నాయి.
OnePlus Nord CE 4 లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఇంకా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఆక్వాటచ్ టెక్నాలజీ ఉన్నాయి.











