హైలైట్స్:
- 2023 లో OnePlus 11 తో పాటు లాంచ్ కానున్న OnePlus 11R
- స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 తో వస్తున్న OnePlus 11, స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో రానున్న OnePlus 11R
- 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50ఎంపి రియర్ కెమెరా OnePlus 11R ప్రధాన ఫీచర్లు
వన్ ప్లస్ 11 సిరీస్ లో పలు ఫోన్లు లాంచ్ కాబోతున్నాయని ఇదివరకే 91మొబైల్స్ చెప్పడం జరిగింది. తాజాగా మైస్మార్ట్‌ప్రైస్, టిప్‌స్టర్ స్టీవ్ హెమ్మర్స్టాఫర్ తో సౌజన్యంతో OnePlus 11 సిరీస్ లైనప్ ను బయటపెట్టింది. ఈ లైనప్ లో OnePlus 11, OnePlus 11 Pro తో పాటు OnePlus 11R కూడా లాంచ్ అవుతుందని రిపోర్ట్ ద్వారా స్పష్టమైంది.
OnePlus 11R స్పెసిఫికేషన్స్
రిపోర్ట్ ప్రకారం, OnePlus 11R క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. ఆర్-సిరీస్ విషయానికి వస్తే, మిగతా మోడల్స్ తో పోల్చితే, ఇది కాస్త తక్కువ ధరను కలిగి ఉంటుంది. అలాగే ఫ్లాగ్షిప్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇకపోతే OnePlus 11 ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో లాంచ్ కానుందని తెలుస్తోంది. నెక్ట్స్ జనరేషన్ చిప్సెట్ అయిన 8 జెన్ 2 ని క్వాల్కమ్ కంపెనీ ఈ ఏడాది నవంబర్ నెలలో జరిగే ఈవెంట్ లో లాంచ్ చేయనుంది.
OnePlus 11R ఇతర ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ ని చూస్తే, ఈ ఫోన్ 8జిబి , 16జిబి ర్యామ్, 128జిబి, 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో రానుందని సమాచారం. ఇప్పుడు డిస్ప్లే గురించి తెలుసుకుందాం. OnePlus 11R లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ డిస్ప్లే ఉండనుంది. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ప్రీమియమ్ ఫోన్లలో కూడా ఇటువంటి డిస్ప్లే ఫీచర్లనే ఇటీవలి కాలంలో మనం చూస్తున్నాం.
ఇప్పుడు OnePlus 11R కెమెరా విభాగం ఎలా ఉంటుందో చూద్దాం. OnePlus 11R లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 16ఎంపి కెమెరాను అందించనున్నారు. ఇక పవర్ విషయానికి వస్తే, ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఈ బ్యాటరీ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
ప్రస్తుతానికి OnePlus 11R కి సంబంధించిన లాంచ్ తేదీ, ధర ఏమీ తెలియదు. మార్కెట్ లో ఇప్పటికే లాంచ్ అయిన OnePlus 10R ధర రూ.32,999 గా ఉంది. మరి OnePlus 11R ధర కూడా ఇదే స్థాయిలో ఉంటుందో లేదా ఇంకా ఎక్కువగా ఉంటుందో చూడాలి.
OPPO తో కలిసాక OnePlus ఫోన్ల కెమెరా స్పెసిఫికేషన్స్ ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. ఏళ్ళు గడుస్తున్నా ఇంకా 8ఎంపి వైడ్ యాంగిల్, 2ఎంపి మ్యాక్రో కెమెరాలను ఈ కంపెనీ వదలడం లేదు. మరోవైపు ఫోన్ల ధరలేమో రూ.30 వేలు, రూ.40 వేలకు పైన ఉంటున్నా, ఈ 8ఎంపి వైడ్ యాంగిల్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ లు మాత్రం మారడం లేదు. వాటి వల్ల పెద్దగా ఉపయోగం కూడా లేదు. వీటి స్థానంలో 12ఎంపి/13ఎంపి వైడ్ యాంగిల్ కెమెరా, 8ఎంపి మ్యాక్రో లెన్స్ ఇస్తే బాగుంటుంది.
లేదంటే, మోటోరోలా/ఐకూ మాదిరిగా వైడ్ యాంగిల్ కెమెరాలోనే మ్యాక్రో ఆప్షన్ ఇస్తే బెటర్. దాని వల్లన ఏమైనా ఉపయోగం ఉంటుంది. అంతేగానీ, పనికిరాని కెమెరాలను ఎన్ని ఇచ్చి ఏం లాభం? ఉపయోగపడే కెమెరాలు రెండుంటే చాలదా? ఫోన్లకు డబ్బులు ఎక్కువ వసూలు చేస్తున్నప్పుడు, మూడు మంచి రెజుల్యూషన్, ఓఐఎస్ కలిగిన కెమెరాలను ఇవ్వవచ్చు. కానీ లాభాలు ఎక్కువ ఆర్జించాలనే లక్ష్యంతో వాల్యూ ఫర్ మనీ ఫోన్లను కంపెనీలు తీసుకు రావడం లేదు. యూజర్ల నుంచి గట్టి వ్యతిరేకత వస్తే గానీ, కంపెనీల తీరు మారదని అర్థమవుతోంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.












