లీకైన OnePlus 12 పూర్తి స్పెసిఫికేషన్స్, లాంచ్ టైమ్‌లైన్ వివరాలు!

Highlights

  • తాజాగా లీకైన OnePlus 12 లాంచ్ టైమ్‌లైన్
  • ఆగస్టులో OnePlus 12 లాంచ్ కానుందని సమాచారం
  • 2కే రెజుల్యూషన్, 8 జెన్ 3 చిప్‌తో వస్తోన్న డివైజ్

OnePlus 11 డివైజ్ మార్కెట్ లోకి వచ్చి కొన్ని నెలలే అయ్యింది. అప్పుడే OnePlus 12 గురించి హడావుడి మొదలైంది. వన్‌ప్లస్ ఫ్యాన్స్ కూడా ఫ్లాగ్షిప్ డివైజ్ OnePlus 12 లాంచ్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా OnePlus 12 లాంచ్ టైమ్‌లైన్ కి సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. ఈ వార్తలో చైనా మరియు గ్లోబల్ లాంచ్ టైమ్‌లైన్స్ వివరాలు ఉన్నాయి.

అంతేకాదు, OnePlus Nord CE 3, OnePlus Ace2 Pro, OnePlus Foldable లాంచ్ టైమ్‌లైన్స్ కూడా లీక్ ద్వారా బయటకు వచ్చాయి. సరే, ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.

OnePlus 12 లాంచ్ టైమ్‌లైన్ (అంచనా)

OnePlus 12 స్మార్ట్ ఫోన్ చైనాలో డిసెంబర్ నెలలో లాంచ్ కానుందని సమాచారం. ఇకపోతే 2024 ఫిబ్రవరిలో గ్లోబల్ గా OnePlus 12 డివైజ్ ఎంట్రీ ఇవ్వనుంది. టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ ఈ వివరాలు వెల్లడించారు. సాధారణంగా వన్‌ప్లస్ తన ఫోన్లను ఇదే సమయాల్లో లాంచ్ చేస్తుండటంతో, లీక్ నిజమేననిపిస్తోంది. అయితే లాంచ్ కి ఇంకా నెలల సమయం ఉండటంతో, అప్పుడే కంపెనీ నుంచి అధికార ప్రకటన వచ్చే అవకాశం లేదు.

OnePlus Nord CE 3, Ace 2 Pro, ఫోల్డబుల్ ఫోన్ల లాంచ్ టైమ్‌లైన్స్

టిప్‌స్టర్ ప్రకారం, మరొక 3 వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్ల లాంచ్ టైమ్‌లైన్స్ కూడా రివీల్ అయ్యాయి. ఆగస్టులో OnePlus Nord CE 3, Ace 2 Pro డివైజెస్ లాంచ్ కానున్నట్లు సమాచారం. వన్‌ప్లస్ సంస్థ యొక్క తొలి ఫోల్డబుల్ ఫోన్ కూడా ఆగస్టులోనే లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈమధ్యలో వన్‌ప్లస్ సంస్థ R మోడల్ ని కూడా తీసుకురానుందని టిప్‌స్టర్ చెబుతున్నారు.

ఇక OnePlus 12 విషయానికి వస్తే, దీని ద్వారా పూర్తి స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. OnLeaks సౌజన్యంతో SmartPrix వెబ్‌సైట్ OnePlus 12 పూర్తి స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసింది.

OnePlus 12 స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: OnePlus 12 లో 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OnePlus 12 స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ ఉంటుందని సమాచారం.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus 12 డివైజ్ 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీని ఆఫర్ చేయనుంది.
  • కెమెరా: OnePlus 12 స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 64ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 3x ఆప్టికల్ జూమ్ ఫీచర్ ఉంటుంది. కెమెరా సెన్సర్స్ ని హాజల్‌బ్లడ్ తో కలిసి వన్‌ప్లస్ అభివృద్ధి చేసింది.
  • బ్యాటరీ: OnePlus 12 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
  • సాఫ్ట్‌వేర్: OnePlus 12 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.